YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కలెక్టర్ల చేతిలో మున్సిపల్ ఛైర్మన్లు

కలెక్టర్ల చేతిలో  మున్సిపల్ ఛైర్మన్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తెలంగాణ కొత్త మున్సిపల్ చట్టంలో అనూహ్యమైన విషయాలు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్‌లు అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్ వేటు వేసే అధికారాన్ని కొత్త చట్టం…కలెక్టర్లకు కల్పిస్తోంది. మున్సిపల్ చట్టం 1965, మున్సిపల్ చట్టం 1994 స్థానంలో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మినహా.. మొత్తంగా 128 మున్సిపాలిటీలు. , 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలను పదిహేను రోజల్లో పూర్తి చేసేలా నిబంధనలు మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణకు కాలవ్యవధిని కుదించారు. పదిహేను రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగిసేలా బిల్లులో ప్రతిపాదించారు..నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి పదిహేనవ రోజున పోలింగ్ నిర్వహించనున్నారు.. కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలనేది మాత్రం ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అంటే రెండు వారాల్లో ప్రక్రియ ముగిసిపోతుంది. గతంలో..వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించినప్పుడు కూడా ఇంతే వేగంగా ప్రక్రియ పూర్తి చేశారు.   ప్రజలు ఎన్నుకున్నప్పటికీ.. కొత్త చట్టంలో… మున్సిపల్ చైర్మన్లకు విశేషాధికారులు లేవు. సస్పెన్షన్ విధించడానికి కలెక్టర్‌కు… అసలు తొలగించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైన, అత్యవసరమైన అధికారాలు కల్పించారు. అక్రమాలకు పాల్పడే ఛైర్మన్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారు. వీరిపై ఆరోపణలు రుజువైతే పూర్తిగా తొలగించే అధికారం ప్రభుత్వానిదేనని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలతో.. ఇక .. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. గెలిచినా… చైర్మన్ పీఠంలో ఉండాలంటే… ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండాల్సిందే. మున్సిపల్ చైర్మన్లకు.. చట్టం చాలా బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రతి నెలా మున్సిపల్ సమావేశాలు ఏర్పాటు చేయడమే కాదు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, చెత్త సేకరణ విషయాల్లో బాధ్యతలు నిర్ణయించారు. ప్రతీ మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. మొక్కలు నాటడం, నర్సరీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పార్క్ ల అభివృద్ధి, నిర్వహణ, నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని బిల్లులో పొందుపరిచారు. బోర్ ల వాడకం తగ్గింపు, వర్షపు నీటిని ఒడిసి పట్టే విధానలు తప్పని సరి చేయాలని బిల్లులో పేర్కొన్నారు..

Related Posts