YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బడుగుల కండ్లలో వెలుగులు నిండాలి తండ్రి పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్

బడుగుల కండ్లలో వెలుగులు నిండాలి తండ్రి పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పెంచిన ఫించన్ల ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ బడుగుల కండ్లలో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మొత్తం రాష్ట్రానికే ఆయన తండ్రి పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు. ఫించన్ల పెంపు కార్యక్రమానికి ఉద్యమ సమయలో నే అంకురార్పణ జరిగిందని ఆయన వెల్లడించారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన అధిగమించి బడుగుల కండ్లలో వెలుగులు చూడాలన్న తపనతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫించన్ మొత్తాలను రెట్టింపు చేశారని చెప్పారు. ఒక్క ఫించన్ల పేరు మీద తెలంగాణా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తం అక్షరాల 12 వేల కోట్లు అని యావత్ భారతదేశంలో ఇంత మొత్తము చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం టి ఆర్ యస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.అంతే గాకుండా ఒక్క సంక్షేమ రంగానికే 45 వేల కోట్లు కెటయించి ఖర్చు పెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని ఆయన కొని యాడారు.
ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఫించన్ల పేరుతో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 91 కోట్ల 55 లక్షల 75 వేల 800 కు చేరిందన్నారు.తెలంగాణా ఏర్పాటుకు ముందు ఆకలి చావులు,ఆత్మహత్య లతో తల్లడిల్లిందన్నారు.అటువంటి పరిస్థితులను ఉద్యమ సమయంలో నే అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిందే తడవుగా 1000 రూపాయలు,1500 ఫించన్ పథకానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.చెప్పింది చెప్పినట్లు చెయ్యడం ...ఇచ్చిన హామీ తూ చ తప్పకుండా అమలు పరిచిన చరిత్ర కూడా యావత్ భారతదేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కుందన్నారు.
కరువుతో తల్లడిల్లుతున్న తెలంగాణా ప్రాంతంలో  వయో వృద్దులైన తల్లి తండ్రులను పోషించడం బిడ్డకు భారం కాదని అయితే అదే సమయంలో ఎదిగే పిల్లలా ఒదిగే వృద్దులా అన్న మీమాంసతో సందిగ్ధంలో ఉన్న బడుగులకు కొత్త రాష్ట్రం రూపంలో అదృష్టం కలసి వచ్చిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఎన్నికల మ్యానిఫెస్టో లోనే ఆసరా ఫించన్ పధకాన్ని పెట్టి ఆచరణ లో అమలు పరిచిన రికార్డ్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం అని మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.
70 ఏండ్లుగా విద్వంసం అయిన తెలంగాణా ను గాడిలో పెడుతున్న సందర్భంలో వచ్చిన ఎన్నికలలోను ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విశ్వాసం తో పట్టం కట్టినందునే ఈ రోజు పెంచిన ఫించన్ ఉత్తర్వులను లబ్ధిదారులు అందుకుంటున్నారని ఆయన చెప్పారు .ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని యావత్ భారత దేశంలోనే విప్లవాత్మక నిర్ణయమని ఆయన చెప్పారు. ఒక్క ఆసరా ఫించన్లు మాత్రమే కాకుండా నానాటికి కుదెలౌతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఒక్కసారిగా ఎకమొత్తం లో 10 వేల కోట్ల ఋణా లను మాఫీ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాననికి దక్కిందన్నారు. అంతే గాకుండా తొలకరి జల్లుతో అప్పు కోసం తిరుగకుండా ఉండేందుకే రైతుబంధు పధకాన్ని ప్రవేశపెట్టి ఏకరాకు సాలీనా 10 వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వమని ఆయన చెప్పారు. అంతే గాకుండా ఆకస్మికంగా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు గాను రైతు భీమా పధకాన్ని ప్రవేశ పెట్టింది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు .యావత్ ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా సహజ మరణాలకు భీమా సౌకర్యం కల్పించడమే కాకుండ రైతు మృతి చెందిన అయిదు రోజులకే అయిదు లక్షల మొత్తం అందేలా భీమా సౌకర్యం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు.

Related Posts