YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిమజ్జనానికి ఛీఫ్ గా మోహన్ భగవత్

నిమజ్జనానికి ఛీఫ్ గా మోహన్ భగవత్

నిమజ్జనానికి ఛీఫ్ గా మోహన్ భగవత్
హైద్రాబాద్, సెప్టెంబర్ 11  
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఎన్నడూ లేని విధంగా ఈసారి భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. వినాయక నిమజ్జనంతో పాటు మరొక అంశంపై కూడా దృష్టి సారించారు పోలీసులు. అదే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన. ఈసారి హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమజ్జనానికి  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి. ఆర్ఎస్ఎస్ చీఫ్ నిమజ్జనంలో పాల్డొని ప్రసంగం చేయనున్నారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అంటేనే ఒక పెద్ద పండుగ. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొంటారు. అందుకే వినాయజక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రతిసారి పోలీసులు ఎంతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జనంలో సాధారణంగానే పోలీసులు అలర్ట్ గా ఉంటారు. ఈసారి నిమజ్జనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరవుతున్నారు. ఇప్పటికే యాదాద్రి ఘటనతో పాటు అనేక విషయాల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో బీజేపీ ఢీ కొడుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బాలాపూర్ నుండి ప్రారంభమయ్యే గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్నారు. కాశ్మీర్ 371 ఆర్టికల్ రద్దు తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ పాల్గొంటున్న కార్యక్రమం ఇది. మోహన్ భగవత్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని చార్మినార్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో 
ప్రసంగం చేయనున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ సందేశంపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో సై అంటున్న బీజేపీకి పట్టు బిగిస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గణేష్ నిమజ్జనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్‌ని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆహ్వానించారు. దీంతో మోహన్ భగవత్ ప్రసంగంలో ఎలాంటి ఉద్రిక్తతలు తావు లేకుండా పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు. నిమజ్జనం రోజు సాయంత్రం మోహన్ భగవత్ ఎంజీ మార్కెట్ చౌరస్తా వద్ద ప్రసంగిస్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగాన్ని భక్తులు వీక్షించేందుకు నగరం మొత్తం 10 స్క్రీన్లు ఏర్పాటు చేసింది గణేష్ ఉత్సవ సమితి. ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో పాటు, పలువురు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు నిమజ్జన కార్యక్రమంలో మొదటిసారి పాల్గొనబోతున్నారు. నిమజ్జనం రోజు ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగంలో కాశ్మీర్ అంశంపై మాట్లాడే అవకాశం ఉన్నందున ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి అటు గణేష్ నిమజ్జనం.. ఇటు ఆర్ఎస్ఎస్ చీఫ్ హాజరవుతుండడంతో పోలీసులు హై అలర్ట్‌గా ఉన్నారు. మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు.

Related Posts