YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మూడోరోజు గాలింపు చర్యలు

మూడోరోజు గాలింపు చర్యలు

మూడోరోజు గాలింపు చర్యలు
కాకినాడ  సెప్టెంబర్ 17, 
పికొండల టూర్ బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం మంగళవారం మూడో రోజు గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.  గోదావరిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 
ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. ధవళేశ్వరం ఆనకట్ట 17వ గేటు వద్దకు ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. 
కచ్చులూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాన్ని దేవీపట్నం పోలీసు స్టేషన్కు  తరలించారు. ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు మరో మృతదేహం కొట్టుకువచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇసుక రేవు వద్ద మరో మృతదేహాన్ని గుర్తించారు.  బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ప్రతికూలం ఏర్పడుతోంది.  సుడిగుండాలు, వరద ఉధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడింది. ఇంకా మరో 36 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు నేవీకి చెందిన సైనికులు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Related Posts