YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రమాదాలకు అడ్డాగా నందిగామ గడ్డ...  వరుసగా మూడు కార్లు ఢీ. 

ప్రమాదాలకు అడ్డాగా నందిగామ గడ్డ...  వరుసగా మూడు కార్లు ఢీ. 

ప్రమాదాలకు అడ్డాగా నందిగామ గడ్డ...  వరుసగా మూడు కార్లు ఢీ. 
షాద్ నగర్  
నందిగామ మండల కేంద్రంలో మిషన్ భగీరథ కోసం ఆర్ అండ్ బి రోడ్డును తవ్వి పైపులైన్ వేశారు.పలుమార్లు తాత్కాలిక మరమ్మతులు చేశారు కానీ భారీ వాహనాల రాకపోకలకు పూర్తిగా కుంగిపోయింది.రోడ్డంత గుంతగా ఏర్పడింది.ఆ గుంత కూడా దగ్గరకు వచ్చేదాకా కనిపించదు.దగ్గరకు వచ్చాక కనిపించేసారికి సడన్ బ్రేక్ వేసేసారికి వెనకాల వచ్చే వారికి అర్థం 
కాలేక ముందున్న వాహనాలను ఢీకొంటున్నారు.ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.బుధవారం ఇలాంటి సంఘటనే జరిగింది.షాదనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కార్లు నందిగామ మండల కేంద్రం వద్దకు రాగానే ముందున్న గోతుని చూసి సడన్ బ్రేక్ వేయగా వెనకాల వస్తున్న రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతున్నాయి.ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు.కారణం అధికారులదే..ఇదే ప్రదేశంలో వరుసగా ఎదో ఒక ప్రమాదం జరుగుతున్నాయి.ఎవ్వరికీ పిర్యాది చేయాలో తెలియక గమ్మున వారి గమ్యాలకు చేరుకుంటున్నారు.ఒకవేళ పిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ కేసులు అంటూ భయపడి వెనుదిరుగుతున్నారు.కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దారుణం అంటూ మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు.ఆర్ అండ్ బి అధికారులు గోతుఏర్పడి పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్న కూడా పట్టించుకోవడం లేదు.కనీసం ప్రాణాలు పోతున్న కూడా పట్టించుకోవడం లేదంటే అధికారులు ఏ స్థాయిలో వారు విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అధికారుల తీరుపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గత నెల 25వ తేదీన షాబాద్ మండలానికి చెందిన వ్యక్తి బస్సుల్లో నుంచి ఇదే గోతువాల్ల ఎగిరిపడి మృత్యువాత పడ్డాడు.అయిన అధికారులు కనీసం ఆ రోడ్డును,గోతుని పర్యవేక్షించిన పాపాన కుడా పోలేదని ప్రజలు,ప్రయాణికులు మండిపడుతున్నారు.

Related Posts