YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంచి సమయం.. 

Highlights

  • శ్రీరస్తు. శుభమస్తు
  • తేదీ: 16-03-2018 ,శుక్రవారం 
మంచి సమయం.. 

" హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం, సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం"

ఫాల్గుణ మాసం బహుళ 

 చతుర్దశి 18.18 వరకు, తర్వాత అమావాస్య మొదలయ్యి మర్నాడు శనివారం సాయంత్రం  06:45వరకు మాత్రమే ఉంటుంది*

శతభిష నక్షత్రం 18.45 వరకు, తర్వాత పూర్వాభాద్ర

ఈ రోజు అనుకూల ముహూర్త సమయాలు
             
మంచి సమయం. 

తె. 03.35 - ఉ.06.05 గం.ల వరకు.
ఉ.06.40 - ఉ.08.40 గం.ల వరకు.
సా.17.15 - రా.18.10 గం.ల వరకు.

విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన వెంట మిథిలా నగరానికి తీసుకొచ్చి, ఆ ధనస్సును చూడాలి అనుకుంటున్నారు అని చెప్పాడు. జనకుడు ఆ ధనస్సు యొక్క చరిత్ర చెప్పి, ఇప్పటివరకు దేవతలనుండి మొదలుకొని వీరూ వారు అని ప్రశ్న లేదు ఎందరో వచ్చి కనీసం ఎత్తలేక పోయారు. దాన్ని ఎత్తితే సీతమ్మను వివాహం ఆడాలి అనే శరతు పెట్టి తెప్పించాడు. *ఆ ధనస్సుని ఎనిమిది చక్రాల బండిపై ఉంది, దాన్ని ఐదు వేల మంది కండలు తిరిగి బలం కల్గిన వారు తీసుకు వచ్చారు* . ఇది అక్కడి సన్నివేశం. ధనస్సు ఉన్న బండికి ఎందుకు ఎనిమిది చక్రాలు? ఎందుకు దాన్ని ఐదు వేల మంది లాక్కోచ్చారు ? ఈ సన్నివేశం వేదంలోని ఒక రహస్యార్థాన్ని వివరిస్తుంది.
ఎనిమిది చక్రాలు అంటే ఎనిమిది అక్షరాలు కలిగిన, జ్ఞానం ఇవ్వగల నారాయణ అష్టాక్షరి మహామంత్రం . అది ఓంకారపు సారం. ఓంకారాన్ని ధనస్సుతోకానీ, శంఖంతోకానీ పోల్చుతారు. ఎనిమిది అక్షరాల మంత్రం ఓంకారం యొక్క అర్థాన్ని తెలుపుతాయి. ధనస్సు కల్గిన బండిని ఐదువేల మంది మోసుకురావడమే దాని అర్థం యొక్క సాంకేతం. ఓంకారం తెలుపేది ఐదు అర్థాలను. ఓంటికి బలిమి అంటే మనం యముకలు, కండలు గట్టిగా ఉండటం. జ్ఞానానికి బలం అంటే ఏమి ? ఎందరెందరు ఎటు చెబితే అటూ చెప్పినట్టుగా కొట్టుకుపోకుండా, ప్రమాణంతో గట్టిపడి వాడికంటూ ఒక విశ్వాసం చెదరక నిలిస్తే అది సరియైన జ్ఞానం. జ్ఞానం అనేది ఎవడైనా వచ్చి వాడికున్న విశ్వాసాన్ని చెదిర్చే ప్రయత్నం చేస్తే అది కదల ఉండగలగటం ఒక బలం అయితే, ఎదుటివాడికి సరియైన సమాధానం చెప్పగలగడం సరియైన బలం అని చెప్పవచ్చు. ఐదింటికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానం అంటే. అవి నేనెవరు, వాడెవరు, పొందాల్సింది ఏమి, నేను ఎట్లా పొందడం, ఎందుకు పొందలేక పోతున్నాను. ఈ ఐదింటిని స్పష్టంగా చెప్పగలదు ఓంకారం, అందుకే ఐదువేల మంది తోసుకొచ్చిన బండి అని సంకేతంగా చెప్పారు.

శ్రీరామ చంద్రుడు ఒక్క సారిగా ఆధనస్సును ఎత్తాడు . దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్క సారిగా ధనస్సు రెండు ముక్కలైంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరామ చంద్రుడి చేతిలో ఉంది, రెండో భాగం ఆ నారి ద్వారా వ్రేలాడుతోంది. ఇది అప్పటి దృష్యం. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆధనస్సు ఎవ్వరికీ వంగలేదు ఒక్క రాముడికే వంగింది. ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింప జేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించాడు. అట్లా పట్టుకొని నిలబడడమే ఒక రహస్యం.

 
 

Related Posts