YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మొన్న గంట... నిన్న వంశీ... 

మొన్న గంట... నిన్న వంశీ... 

మొన్న గంట... నిన్న వంశీ... 
ఇంకా ఎంత మంది...
విజయవాడ, నవంబర్ 16
మొన్న గంట... నిన్న వంశీ... ఇంకా ఎంత మంది... ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న ప్రశ్న...ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలు. ఎన్నికలైన తర్వాత టీడీపీ నుంచి బీజేపీకి పెరుగుతున్న వలసలు, కొన్ని రోజుల్లో మరింతమంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కాషాయగూటికి చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో, సోము వీర్రాజు కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలను మొత్తం, తమవైపు లాగేసుకుంటామని అన్నారు సోము వీర్రాజు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను బీజేపీలో కలుపుకుంటామన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనని కలిశారని, త్వరలోనే ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నేతలు బీజేపీలోకి వస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాబోయే కొన్ని రోజుల్లో, ఏపీలో బీజేపీ ప్రకంపనలకు, సోము వీర్రాజు కామెంట్లే సంకేతాలన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. సోము వీర్రాజు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, అతిత్వరలోనే శాసన సభలో బీజేపీ అధ్యక్షా అనడం ఖాయమని అర్థమవుతోంది. టీడీపీని చీల్చి, సగానికి కంటే ఎక్కువమందిని లాగి, తమను బీజేపీ పక్షంగా గుర్తించాలని, స్పీకర్‌ను కోరే అవకాశముంది. ఒకవేళ స్పీకర్ ఆమోదిస్తే, అసెంబ్లీలో బీజేపీ ఖాతా తెరిచినట్టే. మరి పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేదిలేదంటున్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఒకవేళ టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటికి వచ్చి, తమను బీజేపీ సభ్యులుగా గుర్తించాలని కోరితే, ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. ఇంతకీ ఎవరెవరు కమలంలో చేరబోతున్నారు? గంటా తనతో పాటు ఎవరెవరికి కాషాయతీర్థం ఇప్పించబోతున్నారు? గంటా శ్రీనివాస రావు. మాజీ మంత్రి. విశాఖ టీడీపీకి కీలక నేత. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఈయన మనసు, మనసులో లేదు. ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి జంప్ అవుదామా అని చూస్తున్నారు. అయితే, వైసీపీలోకి వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా, రాజీనామా నిబంధన అడ్డువస్తుండటంతో, వెళ్లలేకపోయారు. దీంతో మిగిలింది బీజేపీయేనని డిసైడయ్యారు. అందుకే పార్టీకి కార్యక్రమాలకు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న గంటా, మొన్ననే ఢిల్లీలో తిష్టవేసి, బీజేపీ పెద్దలతో అన్ని విషయాలు మాట్లాడుకున్నారట. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఆయన భేటి అయిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోము వీర్రాజు చెప్పినట్టు, టీడీపీ ఖాళీ అవ్వడం ప్రారంభిస్తే, అది గంటాతోనే మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది. గంటా ఒక్కడే కాదు, టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలను సైతం, తనతో పాటు కమలంలో చేర్పించేందుకు ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో గంటా ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. సుజనా చౌదరితోనూ మాట్లాడించారని సమాచారం. అలాగే విశాఖ జిల్లాకే చెందిన మరో త

Related Posts