YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అభద్రతా భావంలో జగన్

అభద్రతా భావంలో జగన్

అభద్రతా భావంలో జగన్
విజయవాడ నవంబర్ 16 
శాసన సభ ఎన్నికల్లో ఆబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభధ్రతా భావంలో ఉన్నారు. చంద్ర బాబు ఇసుక దీక్ష చేపట్టిన నాటినుండి కూర్చి భయం పట్టుకుంది. 151మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే,  వారితే కాకుండా మా శాసనసభ్యులు ను భయపెట్టి బెదిరించి మాపై ఉసుగోల్పుతున్నాడు జగన్ అని మాజీమంత్రి దేవినేఇన ఉమా అన్నారు. సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసి కొడాలి నాని ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారు. అయ్యప్ప దీక్షలో ఉండి నోటి కి వచ్చినట్లు మాట్లాడటం సంస్కారమా. రాష్ట్రంలో ఇసుక కోరత ఉద్యమాన్ని ఇతర సమస్యలను ప్రక్క దారికి పట్టించెందుకు మా శాసనసభ్యలతో తిట్టిస్తున్నావని మండిపడ్డారు. చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా తీసేయాలనే ఆలోచన తో ఇలా వ్యవహరిస్తున్నావని విమర్శించారు.  ప్రాణాలకు బయపడే వాళ్ళం కాదు. నీ దురాగాతాలను అడ్డుకుంటాం.  ఒకే రోజు ఇద్దరు నేతలను తీసుకెళ్ళావు. నీ ఎమ్మెల్యేలు  ప్రక్క చూపులు చూస్తున్నారు. నువ్వు జైలుకి వెళ్ళటం తప్పదని అయన హెచ్చరించారు. 

Related Posts