YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వండి సత్తా చూపిస్తా…

పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వండి సత్తా చూపిస్తా…

పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వండి సత్తా చూపిస్తా… 
హైదరాబాద్ నవంబర్ 16, 
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీసీ పదవి ఇస్తే 2023 ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పారు. పార్టీ సూచించిన వ్యక్తిని పోటీకి నిలబెడతానని తెలిపారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఈ నెల 20 వ తేదీ తరువాత ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలుస్తానన్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి కోరుతూ తన బయోడేటా, పార్టీలో అనుభవం వివరాలను తెలుపుతూ సోనియాగాంధీకి రిజిస్టర్ పోస్ట్ చేశానని జగ్గారెడ్డి వెల్లడించారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉండి పార్టీని పొగిడిన వారు పార్టీ మారిన తర్వాత విమర్శలు చేయొద్దని కోరారు

Related Posts