YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని హైకోర్టు లను ప్రకటించక పోతే రాయలసీమ విద్యార్థుల సెగ చూపిస్తాం  జేఏసీ

రాజధాని హైకోర్టు లను ప్రకటించక పోతే రాయలసీమ విద్యార్థుల సెగ చూపిస్తాం  జేఏసీ

రాజధాని హైకోర్టు లను ప్రకటించక పోతే రాయలసీమ విద్యార్థుల సెగ చూపిస్తాం  జేఏసీ
బేతంచర్ల  నవంబర్ 16, 
రాయలసీమ కు రాజధాని కర్నూలు కు హైకోర్టు ప్రకటించకపోతే రాయలసీమ విద్యార్థుల సెగను ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని రాయలసీమ విద్యార్థుల జెఎసి నాయకులు హెచ్చరించారు రాయలసీమకు రాజధాని కర్నూల్ కు హైకోర్టు కావాలి రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్యమాల్లో జిల్లాలలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇండ్లను ముట్టడి కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని విద్యార్థులు జెఎసి నాయకులు ముట్టడించారు ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ నుండి ఆర్థిక శాఖ మంత్రి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు మంత్రి ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు మంత్రులు గా ఎంతోమంది ఎదిగారు రాయలసీమ వాసుల తలరాతలు మాత్రం మార లేదన్నారు శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూల్ కు హైకోర్టు రాయలసీమకు రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వీటి నీ సాధించుకోవడం ప్రాణ త్యాగాల కన్నా వెనకాడబోమని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రకటించకపోతే ఈనెల 22న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని రాయలసీమ విద్యార్థుల సెగ చూపుతామని హెచ్చరించారు అనంతరం మంత్రి ఇంటి గేటుకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ శ్రీ రాములు నాయకులు మహేంద్ర రవీంద్రనాథ్ రాజేష్  విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు

Related Posts