YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో నియంత పాలన

తెలంగాణలో నియంత పాలన

తెలంగాణలో నియంత పాలన
నాగర్ కర్నూలు నవంబర్ 20
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే .లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుధవారం  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంనీ  ఆయన ప్రారంభించారు. అనంతరం గాంధీ పార్క్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి, శిబిరంలో బైఠాయించారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైనదని,  నేడు రాష్ట్రం వచ్చాక  కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఈ పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కార్మికుల కష్టాలు తీర్చాల్సిన సీఎం  కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని  విమర్శించారు.  ఏకపక్ష   నిర్ణయాలతో  రాష్ట్ర ప్రజలను అణచివేస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియంత పోకడలు అవలంబిస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన పర్యటించి పార్టీని పటిష్ట పరచాలని సూచించారు.

Related Posts