YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కులం, మతం, ప్రాంతం ముసుగులో జగన్‌ నీచ రాజకీయాలు: బుద్దా వెంకన్న

కులం, మతం, ప్రాంతం ముసుగులో జగన్‌ నీచ రాజకీయాలు: బుద్దా వెంకన్న

కులం, మతం, ప్రాంతం ముసుగులో జగన్‌ నీచ రాజకీయాలు: బుద్దా వెంకన్న

విజయవాడ 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కులం, మతం, ప్రాంతం ముసుగులో నీచ రాజకీయాలు చేయడం జగన్‌కు కొత్త కాదన్నారు. ట్రైన్స్ తగులబెట్టడం లాంటి ఘటనలు అనేకం ఆయన చరిత్రలో ఉన్నాయని విమర్శించారు. నారా హమారా కార్యక్రమంలో అలజడి సృష్టించాలని చిల్లర రాజకీయ ఎత్తుగడ వేసి దొరికిపోయిన ఘటన మర్చిపోయారా? అని ప్రశ్నించారు. వారంతా జగన్ పార్టీ కార్యకర్తలేనని, ఆధారాలతో సహా దొరికిపోయిన తరువాత కూడా మతం రంగు పులమాలి అనుకోవడం జగన్ అవివేకమని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

Related Posts