YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశంలో కొత్త టెన్షన్

తెలుగుదేశంలో కొత్త టెన్షన్

తెలుగుదేశంలో కొత్త టెన్షన్
విజయవాడ, డిసెంబర్ 6
“ఎంతకాలం ఇలా టెన్షన్ భరిస్తాం. ఉన్న వాళ్లు ఉంటారు. వెళ్లే వాళ్లు వెళతారు. ఎవరినీ ఆపేందుకు ప్రయత్నం చేయకండి. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్తేమీ కాదు. వెళ్లిన వాళ్లు తిరిగి వారంతట వారు వస్తే అప్పుడు చూద్దాం. ఇక రాయబారాలు నడపడం ఆపేయండి” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో వ్యాఖ్యానించారు. రోజుకొక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటూ, వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అనేక మంది పార్టీని వీడారు. వైసీపీ ఆవిర్భావ సమయంలోనూ టీడీపీ నుంచి అనేక మంది వెళ్లారు. కానీ వారి పరిస్థితి ఇప్పుడు ఏంటని చంద్రబాబు సీనియర్ నేతలను ప్రశ్నించారని తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీని వీడే ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని సీనియర్ నేతలు కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఈ విధంగా స్పందంచినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని, దాని బలం కార్యకర్తలేనన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.పార్టీలు మారిన వారిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. 2014లో వైసీపీ నుంచి టీడీపీలోకి 23 మంది పార్టీలు మారినా అందులో గెలిచింది ఒక్కరే. కొందరికి టిక్కెట్లు దక్కలేదు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు సీనియర్ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని విస్మరించి అధికారం కోసం తాత్కాలికంగా వెళితే వారి అవసరం పార్టీకి కూడా ఉండదని చంద్రబాబు నిష్కర్షగా చెప్పినట్లు తెలిసింది. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని, దాని వల్ల తమకు జరిగే నష్టం కన్నా వైసీపీకే ఎక్కువ నష్టమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో పార్టీని వీడే వారు ఎక్కువవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలతో సామాజికకవర్గాల వారీగా సీనియర్ నేతలు టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వెళ్లే వారిని ఆపడం వేస్ట్ అని అభిప్రాయపడినట్లు తెలిసింది. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఉదహరించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీని ఎవరు వీడినా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related Posts