YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి? 

 సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి? 

 సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి? 
విజయవాడ జనవరి 23
;మొన్నటి వరకూ సాదాసీదా జనానికి పరిచయం లేని సెలెక్ట్ కమిటి ఇప్పుడో పెద్ద చర్చగా మారటమే కాదు.. ప్రతి ఒక్కరి నోట్లోనూ నానుతున్న పరిస్థితి. ఏపీ రాజధానిని మూడు రాజధానులుగా మారుస్తూ ఏపీ అసెంబ్లీ బిల్లును ఆమోదించటం తెలిసిందే. అనంతరం ఏపీ మండలిలో ఆ బిల్లును ప్రవేశ పెట్టటం.. అక్కడ అధికారపక్షానికి బలం లేక పోవటం.. మండలి ఛైర్మన్ సైతం అనూహ్యం గా వ్యవహారాన్ని సెలెక్ట్ కమిటీ కి బిల్లును పంపాలని నిర్ణయం తీసుకోవటం ఏపీ అధికార పక్షానికి ఎదురు దెబ్బగా మారింది. అసెంబ్లీ లో రాజధాని బిల్లు ఆమోదం పై అధికార పక్షంగా సంబరాలు చేస్తుంటే.. విపక్షం ఉడికి పోయింది. రోజు మారేసరికి మండలి ఛైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీ కి  పంపుతూ నిర్ణయం తీసుకోవటంతో సీన్ కాస్తా మారి పోయింది. ఇలాంటి వేళ సెలెక్ట్ కమిటీ అంటే మిటి? దాని విధులు ఏమిటి? అందులో ఎవరుంటారు? వారేం చేస్తారు? దానికుండే అధికారాలేమిటి? తాజాగా రాజధాని బిల్లు విషయం లో సెలెక్ట్ కమిటికి పంపటం వల్ల ఏం జరగనుంది? లాంటి క్వశ్చన్లు పలువురిని వెంటాడుతున్నాయి.
సింఫుల్ గా చెప్పాలంటే సెలెక్ట్ కమిటీ శాసనమండలి ఛైర్మన్ నియమిస్తారు. మండలిలో ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారో చూసి..అందుకు తగ్గట్లుగా సభ్యుల్ని ఎంపిక చేస్తారు. తాజా ఎపిసోడ్ ను చూస్తే.. సెలెక్ట్ కమిటీని ఎంపిక చేయనున్నది అధికారపక్షానికి తాజాగా ఝులక్ ఇచ్చిన మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీని ఎంపిక చేస్తారు.
అసెంబ్లీకి భిన్నంగా మండలిలో టీడీపీకి పెద్ద ఎత్తున సభ్యులు ఉన్ననేపథ్యంలో.. తాజాగా ఎంపిక చేసే సెలెక్ట్ కమిటీ లో సభ్యుల్లో ఎక్కువ మంది టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలే ఉండనున్నారు. ఒక బిల్లు కారణంగా ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తే.. ఆ బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపొచ్చన్న నిర్ణయాన్ని తీసుకునే అధికారం మండలి ఛైర్మన్ కు ఉంటుంది. తాజా ఎపిసోడ్ లో ఏపీ మండలి ఛైర్మన్ షరీఫ్ అలాంటి పనే చేశారు.
ఒక బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత.. ఆ కమిటీ సభ్యులు సదరు బిల్లుతో ప్రభావితమయ్యే వారి వాదనల్ని వింటారు. అంతేకాదు.. నిపుణులు.. వివిధ వర్గాల వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటుంది. అదంతా జరిగిన తర్వాత తమ ముందుకు వచ్చిన బిల్లులో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే.. ఆ మార్పుల్ని ప్రతిపాదిస్తుంది. దాన్ని తిరిగి అసెంబ్లీకి పంపుతారు. సెలెక్ట్ కమిటీ పరిశీలించి రూపొందించిన అంశాల్ని చర్చించి ఆమోదించిన తర్వాత మరోసారి బిల్లు మండలికి వస్తుంది. అప్పుడు మండలి తాము సూచించిన సూచనలు చేర్చలేదన్న కారణంగా తిరస్కరించే వీలు ఉండదు.అంటే.. రాజధానికి సంబంధించిన జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ తీసుకున్న నిర్ణయం కాలయాపనకు పనికి వస్తుందే కానీ.. అంతిమంగా ప్రభుత్వం తానేం అనుకున్నదో అదే చేయగలదు. కాకుంటే ఇవాళ అనుకున్న పనిని మూడు నెలలకు కానీ.. ఆర్నెల్లు కానీ పూర్తి చేస్తుంది. తాను అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయలేక పోయానన్న భావన తప్పించి అధికార పక్షానికి జరిగే నష్టం ఏమీ ఉండదు. కాకుంటే.. అధికారపక్షం చేసింది తప్పన్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు కొంత వీలు కలుగుతుంది. అంతకు మించి ఆగేదేమీ ఉండదు.

Related Posts