YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధానుల బిల్లుపై జగన్ నివాసంలో కీలక మంతనాలు 

రాజధానుల బిల్లుపై జగన్ నివాసంలో కీలక మంతనాలు 

రాజధానుల బిల్లుపై జగన్ నివాసంలో కీలక మంతనాలు 
అమరావతి జనవరి 23
;శాసనమండలిలో ఏపీకి 3 రాజధానుల బిల్లును అడ్డుకున్న టీడీపీ తీరును సీఎం జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం తాడేపల్లిలోని జగన్ నివాసంలో కీలక మంతనాలు జరిపారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి తో సమావేశమైన సీఎం జగన్ విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి నిన్నటి మండలి పరిణామాలు.. ఏపీకి 3 రాజధానుల బిల్లుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీరియస్ చర్చలు జరిపారు.మండలి చైర్మన్ 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం పై ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి తో జగన్ చర్చిస్తున్నారు.అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెస్స్ తీసుకొచ్చే అవకాశాలు.. న్యాయపరంగా ఇది చెల్లుతుంతా లేదా అనే విషయాల పై సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అమరావతి రైతులు హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వెనక్కి తగ్గకూడదని పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కారు ఏకంగా ఢిల్లీ నుంచి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ని రప్పించి హైకోర్టు లో వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం ఏకంగా ఆయన కు రూ.5కోట్ల ఫీజును ఇచ్చేందుకు జీవో జారీ చేసింది. కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది.

Related Posts