YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఏఎస్సై సస్పెన్షన్‌

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఏఎస్సై సస్పెన్షన్‌

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఏఎస్సై సస్పెన్షన్‌
హైదరాబాద్‌ ఫిబ్రవరి 22 
 భద్రత కల్పించిన వాడే బరి తెగించాడు. వివరాలు చూసినైట్లెతే.. విచారణ నిమిత్తం ఓ మహిళ వద్దకు వెళ్లిన మీర్‌పేట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై) నరేందర్‌.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ షీ బృందానికి ఫిర్యాదు చేశారు. సమాచారాన్ని షీ బృందం.. రాచకొండ కమిషన్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేష్‌ భగవత్‌ వద్దకు తీసుకెళ్లారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాచకొండ సీపీ.. ఏఎస్సై నరేందర్‌ విచారించి, సస్పెండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళల పట్ల అణుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. వారికి రక్షణగా ఉండాలని, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. సామాన్యుల నుంచి ఏ స్థాయి వ్యక్తి పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.

Related Posts