YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళలతో రాజీకీయాలు చేయవద్దు

మహిళలతో రాజీకీయాలు చేయవద్దు

మహిళలతో రాజీకీయాలు చేయవద్దు
తాడేపల్లి ఫిబ్రవరి 24
నేను కారులో అమరావతికి వెళ్తుండగా నా వెహికల్ వల్ల ఓ వ్యక్తికి చిన్న దెబ్బతగిల్తే ఆయనను ఆసుపత్రిలో చూపించుకోమని చెప్పాం. వారు కూడా అదేముందిలే సార్ కావాలని చేసింది కాదు యాక్సిడెంటల్ గా జరిగింది కదా అని అన్నారు.అంతటితో అయిపోయిందని వైకాపా ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రధోమహోత్సవం అయిపోయిన తర్వాత నేను అప్పిరెడ్డి,  కొందరం కలసి రిటర్న్ అయ్యాక నడుచుకుంటూ వస్తున్నాం. జైఅమరావతి... జై సిబిఎన్... అనుకుంటూ కొందరు నా వెనక నినాదాలతో వస్తున్నారు. -ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నినాదాలతోపాటు నా చెవి వద్దకు వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోతున్నారు. సరే మనం ఎదురుతిరిగిమాట్లాడే పరిస్దితి లేదు కాబట్టి పార్టీ నేత అప్పిరెడ్డి చెప్పిన ప్రకారం నా వెహికల్ రాకపోతే అప్పిరెడ్డి వెహికల్ ఎక్కి బయల్దేరాను మద్దూరు వైపు తిరిగితే నేనున్నాను అని చూసి వెహికల్ పై గుద్దారు. లేమల్లే వద్ద కార్లు మారేందుకు ఆగాం.అక్కడకు మా బస్ వచ్చింది.అందులో మహిళలు ఉన్నారు. జైఅమరావతి అని నినాదాలు చెబుతున్నారు.అది కూడా అమరావతి మహిళా జేఏసి అని చెబుతున్నారు.కాని వారందరూ కూడా టిడిపిలో క్రియాశీలకంగా పనిచేసేవాళ్లేనని అన్నారు. ఒక యువతి వచ్చి నీవు ఒక ఎంపీవా అంటూ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసింది.నీవు మహిళవు అలా మాట్లాడకూడదు.అని చెప్పాను.ఈలోపు పది మహిళలు కారం తీసుకువచ్చి నాపై చల్లారు. మా గన్ మెన్లు వచ్చి సార్ వాళ్లు కారం చల్లుతున్నారు అంటూ నన్ను కారులో కూర్చోమని చెప్పారు. మహిళలు నా వద్ద పనిచేసే లక్ష్మణ్ అనేవ్యక్తిని కొట్టారు.వాళ్ల అన్నను చెప్పుతో కొట్టారు వీటికి సంబంధించి వీడియోలు ఉన్నాయి.అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మేం ఎంపీలుగా లేం. ఆ ప్రాంతంలో దళితులు అనేవాళ్లు తిరగడానికి వీల్లేదు.అందరూ తిరుగుతున్నారు.నందిగం సురేష్ అనే వాడే ఒక టార్గెట్.అనే విధంగా వారి వ్యవహారశైలిఉందని అయన ఆరోపించారు.  సురేష్ పై దాడి చేయాలి.ఏం ఖర్మపట్టింది.కారాలు చల్లాల్సిన అవసరం ఏమి వచ్చింది. పైగా కొన్ని చానళ్లకు చెబుతున్నా…నిజం మాట్లాడటానికి అలవాటుపడండని అన్నారు. -వాస్తవం మాట్లాడండి.అబద్దాలు మాట్లాడకండి.అబద్దాలు మాట్లాడి మాట్లాడి చంద్రబాబును 23 సీట్లుకు తీసుకువచ్చారు.  లేనిపోనివి కల్పించుకుని చెప్పి అమరావతి ప్రజలను కూడా అంతే దీనస్దితికి తీసుకువచ్చేటట్లు ఉన్నారని అయన అన్నారు. దాడిలో పాల్గొన్న వాళ్లు అమరావతి ప్రజలు కాదు.అమరావతికి వారికి సంబంధం లేదు.నేను తుళ్లూరు మండలంలోనే తిరుగుతున్నా.ఓ పక్క రైతులు నాకు ఎదురుపడి  మాకు ఫేవర్ అయ్యేలా చూడు అని మాట్లాడుతున్నారు. -దాడికి పాల్పడిన వారందరూ కూడా టిడిపికి పెయిడ్ ఆర్టిస్టులని అయన వ్యాఖ్యానించారు. ఒక మహిళ వచ్చి నాపై కారం చల్లితే అది మా డ్రైవర్ కోటిపై పడింది.అప్పటికి ఆమె కోటిని కారులోనుంచి చొక్కాపట్టుకుని కిందకు లాగుతోంది.వారి అరాచకం ఆ విధంగా ఉందని విమర్శించారు. ఆ బస్సులో చాలామంది పురుషులు కూడా ఉన్నారు.ఆ బస్సులో చూస్తే ముగ్గురు మాఊరుకు సంబంధించినవారు ఉన్నారు. వారు నా కదలికలపై వారు సమాచారం ఇస్తున్నారంట.వీళ్లు ఏ స్దాయిలోకి వెళ్లారంటే రాజధానిలో తాము మాత్రమే బతకాలనే విధంగా తయారయ్యారు. దళితులంటే విలువలేదు .కనీసం ఎంపీగా  అన్నా గౌరవం ఇవ్వాలి కదా.రాజధాని ప్రాంతంలో దళితులు,ఎంపిగా ఉన్ననేను తిరగొద్దా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు. మహిళను నేను తిట్టానని చెబుతున్నారు.వారంతా దాడికి పాల్పడుతున్నా కూడా నేను మహిళలను గౌరవంగా సంబోధించాను. ఇది జరిగిన కాసేపటికే టిడిపి నేత ఆలపాటిరాజా,ఎంపి గల్లాజయదేవ్ లు అక్కడికి ఎలా చేరుకున్నారు. అక్కడ వారు ఉండి మావారిపై దాడిచేశారంటూ అసత్యప్రచారం చేస్తున్నారు. మహిళలను అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని అయన అన్నారు. 

Related Posts