YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 అధికారం పోగానే విమర్శలా ?

 అధికారం పోగానే విమర్శలా ?

 అధికారం పోగానే విమర్శలా ?
ఐదేళ్లు ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోండి
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మండిపాటు
రూ.5.96 కోట్లతో రోడ్డు విస్తరణకు భూమి పూజ
అనంతపురం, ఫిబ్రవరి 24 
‘‘పచ్చకామెర్లు ఉన్న వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అనంతపురంలో టీడీపీ నాయకుల తీరూ అలాంటిదే. అధికారం పోగానే ఓడిపోయామన్న బాధతో విమర్శలు చేస్తున్నారు. మేం తొమ్మిది నెలల్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. మీరు ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఎందుకు మంచి చేయలేదో ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి హితవు పలికారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.5.96 కోట్లతో గుత్తి రోడ్డు నుంచి తాడిపత్రి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సోమవారం కలెక్టర్ గంధం చంద్రుడితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ  2014 జూన్ నుంచి 2019 మే వరకు టీడీపీ పాలకులు నగరాన్ని అవినీతిమయం చేశారన్నారు. ఐదేళ్లు అవినీతి అజెండాగా పని చేసి సంపాదనకే పరిమితం అయ్యారని విమర్శించారు. మూడు కుంపట్లు పెట్టుకుని రాజకీయ స్వార్థంతో నగరాన్ని భ్రస్టుపట్టించారని విమర్శించారు. తాము అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ‘రావాలి జగన్–కావాలి జగన్’ పేరుతో ప్రజల్లోకి వెళితే తమ కష్టాలను వివరించారన్నారు. అధికారంలోకి రాగానే వాటిని తీరుస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నగరంలో రూ.60  కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ నాయకులు తమకు గుంతలమయమైన రోడ్లను అప్పగిస్తే తాము వాటిని పూడ్చి బాగు చేస్తున్నామన్నారు. గుత్తి రోడ్డులోంచి తాడిపత్రి రోడ్డులోకి నాలుగు లేన్ల రోడ్డు వేస్తున్నామని, తద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనున్నట్లు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నగరంలో 2 వేల పింఛన్లు అదనంగా ఇచ్చామన్నారు. ప్రస్తుతం కొన్ని పింఛన్లపై పరిశీలన జరుగుతోంటే టీడీపీ నేతలు అతస్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పింఛన్ అడిగితే ప్రజల చెంప ఛెల్లుమనిపించింది టీడీపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని, ఉగాది నాటికి ఇంటి పట్టాలు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం టీడీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే బుద్ధిచెప్పాలన్నారు. ఏప్రిల్, మే మాసాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ మంజూరవుతుందని, అనంతపురాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.టార్గెట్ మే నెలాఖరు : కలెక్టర్ గంధం చంద్రుడు రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఇదే విషయాన్ని అక్కడే ఉన్న కాంట్రాక్టర్కు  సూచిస్తూ పనులు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. అత్యాశకు పోకూడదని సూచించారు. ప్రజల సౌకర్యార్థం విస్తరణ పనులు చేస్తున్నామన్నారు. రోజు వారీగా పనుల పురోగతిపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల సహకారంతో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ కమిషనర్ చెన్నుడు, నగర పాలక సంస్థ అధికారులు, వైసీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts