YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 చిరకాలం గుర్తుండిపోయే రీతిలో నమస్తే ట్రంప్ కార్యక్రమం

 చిరకాలం గుర్తుండిపోయే రీతిలో నమస్తే ట్రంప్ కార్యక్రమం

 

 చిరకాలం గుర్తుండిపోయే రీతిలో నమస్తే ట్రంప్ కార్యక్రమం
అహ్మదాబాద్ ఫిబ్రవరి 24 
అమెరికా అధ్యక్షుడికి చిరకాలం గుర్తుండిపోయే రీతిలో నమస్తే ట్రంప్ కార్యక్రమం ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని వీరు మొతేరా స్టేడియానికి విచ్చేసిన డోనాల్డ్ ట్రంప్, మెలానియా వేదికపై కి చేరుకుని అశేష జనవాహినికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.  జాతీయ గీతం ఆలపించిన అనంతరం.. భారత్ మాతాకీ జై, నమస్తే ట్రంప్ అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ.. ట్రంప్ నేతృత్వంలో ఇరు దేశాల బంధం మరింత బలపడుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ఇది కొత్త అధ్యాయానికి నాంది అని వ్యాఖ్యానించారు. నమస్తే ట్రంప్ అంటే హౌడీ మోదీకి కొనసాగింపు అని తెలిపారు. మోతెరా స్టేడియం నవచరిత్రకు వేదికగా నిలుస్తోందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది అని అన్నారు.  బలమైన మైత్రిబంధం- ఉజ్వల భవిష్యత్ నినాదంతో కార్యక్రమం నిర్వహించారు. నమస్తే ట్రంప్‌ అంటూ మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇండియా..యూఎస్‌ ఫ్రెండ్‌షిప్‌ అంటూ ప్రధాని నినాదాలు చేశారు. భారత్‌, అమెరికా స్నేహం చిరకాలం వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు. మోతెరా స్టేడియం నవచరిత్రకు వేదికగా నిలుస్తోందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశం మనస్ఫూర్తిగా ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందన్నారు.  భారత్‌- అమెరికా సంబంధాలు గతం కంటే మెరుగుపడుతాయని ఆశాభావం  వ్యక్తం చేశారు. ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం..మనకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతను తెలుపుతోందన్నారు.ప్రాచీన నాగరికతకు ఈ ప్రాంతం పేరుగాంచిందని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఈ ప్రాంతానిది కీలక భూమికని ఆయన అభివర్ణించారు. అహ్మదాబాద్‌ నుంచి ట్రంప్‌ చారిత్రాత్మక భారత పర్యటన ప్రారంభించారని మోదీ వ్యాఖ్యానించారు. కాగా మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు

Related Posts