YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 విద్యకు పేదరికం అడ్డం కాకుండదు

 విద్యకు పేదరికం అడ్డం కాకుండదు

 విద్యకు పేదరికం అడ్డం కాకుండదు
ఒంగోలు ఫిబ్రవరి 24
రాష్ట్రంలో పేద ప్రజలకు పేదరికం విద్యకు అడ్డంకి కాకుడదని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ అదిమూలపు సురేష్  వెల్లడించారు. సోమవారం ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ అదిమూలపు సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ప్రజల కష్ట,నష్టాలను కళ్లారా చూచారన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యా,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.రాష్ట్రంలో భావితరాలకు బంగారు బాటలు వేయడానికి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమం క్రింద6వేల400 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన పధకం క్రింద11 లక్షల మంది లబ్దిదారులకు2వేల300కోట్ల రూపాయలుఖర్చు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తందని అయన అన్నారు.రాష్ట్రంలో ఐ.టి.ఐ,విద్యార్థులకు 10 వేల రూపాయలు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు 15వేల రూపాయలు, డిగ్రీ పైన  చెదువుకునే విద్యార్థులకు 20 వేల రూపాయలు ప్రతి సంవత్సరము వారి తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నాడు నేడు కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి మెనూ లో ప్రతి రోజు మార్పులు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోవచ్చే నెలలో వేల700కోట్ల రూపాయల తో జగనన్న  విద్యా దివేన పథకాన్నీ అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులను ప్రోత్సాహం చడానికి వచ్చే ఏడాది నుండి 1300 రూపాయల విలువైన స్కూలు బ్యాగ్, మూడు యూనిఫామ్ దుస్తులు, టై,షూస్,అందించదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.ప్రభుత్వం ఇచ్చే రాయితీలను వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు చెప్పారు.ఎర్రగొండ పాలెం నియోజకవర్గమును అభివృద్ధి చేయడానికి జిల్లాకు వచ్చే నూతన పరిశ్రమలు,విద్యా సంస్థలు కేటాయింపు ఇవ్వాలని ఆయనకలెక్టర్ కు చెప్పారు. ఎర్రగొండ పాలెం నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ మరియు రైతు బజార్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు తెలియజేసారు.ఎర్రగొండ పాలెం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మోడల్ డిగ్రీ కళాశాలను ఆదర్శ డిగ్రీ కళాశాలగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు నాటికి పశ్చిమ ప్రాంతంలో  కృష్ణా నీరు పారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు దగ్గర నుంచి పరిశీలించారన్నారు. రాష్ట్రంలో నవరత్నాలలో భాగంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.రాష్ట్రంలోతల్లిదండ్రులు పిల్లలనుచదివించడా కి పడుతున్న ఇబ్బందులను  ముఖ్యమంత్రి గుర్తించి పేద ప్రజలను ఆదుకోవాలని అమ్మఓడి కార్యక్రమాన్ని అమలు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల తల్లికి వారిఖాతాలకు 15వేల రూపాయలు వేయడం జరిగిందన్నారు.జిల్లాలో నాడు నేడు కార్యక్రమం క్రింద మొదటి దేశ లొ1400 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.రాబోయే రోజుల్లో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. జిల్లాలో జగన్నన్న వసతి దీవెన పథకం క్రిందసుమారు70 వేల మంది లబ్ధిదారులకు63 కోట్లు రూపాయలు వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో వై.ఎస్.ఆర్.నవశఖము కార్యక్రమంక్రింద ఆరోగ్య శ్రీ పధకం క్రింద ఉన్న 1వెయ్యి రకాల జబ్బులను 1200 రకరకాలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా  వైద్య సేవలు పొందవచున్నారు.పైలట్ ప్రాజెక్టు క్రింద పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య శ్రీ క్రింది 2వేల జబ్బులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థుల తల్లులకు జగనన్న  వసతి దీ వేన కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డి.డి లక్ష్మిసుధ,మెప్మా పి.డి.కృపా రావు,గిరిజన సంక్షేమ శాఖ అధికారి లాలితాభాయి, మైనార్టీ సంక్షేమ శాఖ ఇ. డి.ఝాన్సీ ,ఎర్రగొండ పాలెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి  చంద్ర లీల, ఎంపీడీఓ సాయి కుమార్, తహసీల్దార్ నెహ్రూ బాబు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తి రెడ్డి,ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts