YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 కలవరం(ప్రకాశం)

 కలవరం(ప్రకాశం)

 కలవరం(ప్రకాశం)
ఒంగోలు, ఫిబ్రవరి 24 (న్యూస్ పల్స్): గ్రానైట్ పరిశ్రమ నెత్తిన పిడుగుపడింది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అధికారుల దాడులు, వరుస జరిమానాలతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం తెచ్చిపెట్టే గ్రానైట్‌ క్వారీల యజమానులు. దీనికితోడు రాయల్టీ కూడా పెంచుకుంటూ పోతుండటం కలవరపెడుతోందంటున్నారు. పైగా ప్రత్యర్థి పార్టీ నేతల క్వారీల్లో ఒకటికి రెండుసార్లు సోదాలు చేస్తూ  ఊహించని స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారని, అదే అధికార పార్టీ వారి వాటిల్లో నామమాత్రపు తనిఖీలు చేస్తూ అదే స్థాయిలో  జరిమానాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సమస్య వేధిస్తోందని, దాడులు, కరోనా ప్రభావం, జరిమానాలు, రాయల్టీ పెంపు తదితర అంశాలు వ్యాపార నిర్వహణను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో మొత్తం 108 గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. వాటిలో వివిధ సంస్థలకు కలిపి 140 గెలాక్సీ లీజులుండగా వాటిలో 125, 39 బ్లాక్‌ గ్రానైట్క్‌ు 35, 68 కలర్‌ గ్రానైట్‌ లీజులకు 62 పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలకు నాయకులతోపాటు కేంద్రంలో అధికారంలో భాజపా నాయకులు, ఇతర రాష్ట్రాల వ్యాపార ప్రముఖులు కూడా కొన్నింటిని నిర్వహిస్తున్నారు.  జిల్లాలోని క్వారీల నుంచి ఏటా ప్రభుత్వానికి రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా ఈ ఏడాది రూ.260 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి, కనిగిరి తదితర ప్రాంతాల నుంచి ఆయా రకాల గ్రానైట్లను వ్యాపారులు దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అందుకుగాను వారు క్యూబిక్‌ మీటరుకు ఇంత అని రాయల్టీ రూపంలో గనుల శాఖకు చెల్లిస్తుంటారు. అయితే నిబంధనల మేరకు తవ్వకాలు జరుపుతున్నారా లేదా అని ప్రత్యేక విజిలెన్స్, గనుల శాఖ బృందాలు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతాయి. అయినా 20 శాతం మేరకు అక్రమ రవాణా సాగుతుంటోందన్న ఫిర్యాదులు, విమర్శలు ఉండగా క్యూబిక్‌ మీటర్‌కు ఇంత అని కాకుండా టన్నుల లెక్కన రాయల్టీ విధించాలన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించింది. వసూళ్ల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కూడా గతేడాది చివరిలో ప్రయత్నాలు చేసింది. రాజస్థాన్‌లో అమలవుతున్న టన్నేజి లెక్కన చెల్లింపు అంశాన్ని రాష్ట్ర అధికారుల బృందంతో పరిశీలన చేయించింది. వాహనంలోకి రాళ్లను ఎక్కించిన తర్వాత వేబ్రిడ్జిలో తూకం వేయించి అధిక బరువు ఉంటే దానికి ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటే అక్రమ తరలింపును అడ్డుకోవచ్చని భావించింది. ఇలా అయితే తాము నష్టపోతామని క్వారీయింగ్‌ సంస్థలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ఇప్పటికే తాము చెల్లిస్తున్న రాయల్టీ ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి నివే దించాయి.  ప్రభుత్వం మారిన తర్వాత గత సర్కారు హయాంలోలా రాయల్టీ తగ్గుతుందని క్వారీల యజమానులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. కరోనా ప్రభావంతో ఒక పక్క  ఎగుమతులు పడిపోయి సతమతమవుతుండగా అన్ని పన్నులతో కలిపి 15 శాతం మేర రాయల్టీ పెరుగుదల ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.  క్వారీలపై ఆరు నెలల నుంచి తనిఖీలు చేస్తూ వచ్చిన విజిలెన్స్, గనుల శాఖ అధికారులు పలు సంస్థలకు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రెండు విడతల్లో 60 మందికి పైగా నోటీసులు సిద్ధం చేసిన అధికారులు మరో ఇరవై మందితో మూడో జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నారు.  

Related Posts