YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ సూపరిటెండెంట్ ఆత్మహత్య

టీటీడీ సూపరిటెండెంట్ ఆత్మహత్య

టీటీడీ సూపరిటెండెంట్ ఆత్మహత్య
తిరుపతి, ఫిబ్రవరి 24
టీటీడీ రెండో సత్రంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఉమాశంకర్‌రెడ్డి ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సున్నిత మనస్కుడైన ఉమాశంకర్‌రెడ్డి బలవన్మరణం వెనుక తిరుమలలోని ఓ ఉన్నతాధికారి వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఉమాశంకర్‌రెడ్డి సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సూసైడ్ నోట్‌ను బయట పెట్టకపోవడం, మృతదేహాన్ని కొద్ది నిమిషాల సమయంలోనే పోస్టుమార్టం పూర్తి చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 నెలల క్రితం వరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఉమాశంకర్‌రెడ్డి నిజాయితీగా వ్యవహరిస్తూ, ముక్కుసూటిగా మాట్లాడేవారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సుపధం దర్శనం టికెట్ల మంజూరు విషయంలో శంకర్‌రెడ్డికి ఓ టీటీడీ ఉన్నతాధికారి అందరి ముందే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో తాను నిజాయితీ వ్యవహరిస్తున్నారని, ఎవరికీ భయపడబోనని, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి.. అంటూ బహిరంగంగా ఉన్నతాధికారికి ఉమా శంకర్ రెడ్డి ఎదురు తిరిగి సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారి చైర్మన్ కార్యాలయం నుంచి బదిలీ వేటు వేశారని టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.గతంలో ఆర్జితం కార్యాలయం, మార్కెటింగ్ విభాగం, బోర్డు సెల్, చైర్మన్ క్యాంప్ ఆఫీస్, తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఉమాశంకర్‌రెడ్డి ఇలా ఆత్మహత్యకు పాల్పడడం టీటీడీ ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలోనూ తిరుమల ఉన్నతాధికారి కార్యాలయంలో సీసీగా పనిచేసే సురేష్ అనే టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటను ఉద్యోగులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఉమాశంకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీసి.. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts