YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన దూకుడు

జనసేన దూకుడు

జనసేన దూకుడు
విజయవాడ, ఫిబ్రవరి 24
జనసేన బలోపేతంపై ఫోకస్ పెట్టారు అధినేత పవన్ కళ్యాణ్. పార్టీకి సంబంధించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలను నియమించారు. ఈ కమిటీలు బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకొంటాయని ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు పార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ.. పార్టీ అధ్యక్షుల ఆదేశాలను జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయి వరకూ అమలయ్యేలా చూడటం.. కమిటీ పరిధిలో ప్రాంతాల్లో విసృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారం.. పార్టీని క్షేత్ర స్థాయి వరకూ పటిష్టం చేయడం లక్ష్యాలుగా పని చేస్తాయి. రాష్ట్రంలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉండగా అయిదు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
1. ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ:
శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్టణం, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌ గా సుందరపు విజయ్‌ కుమార్‌(యలమంచిలి), జాయింట్‌ కన్వీనర్‌గా గడసాల అప్పారావు (గాజువాక).. సభ్యులుగా పరుచూరి భాస్కర రావు (అనకాపల్లి), పేడాడ రామ్మోహన్‌ (ఆమదాలవలస), డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు (విశాఖపట్నం)గా ఉంటారు.
2. గోదావరి సంయుక్త కమిటీ:
కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు గోదావరి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌ గా మేడా గురుదత్‌ (రాజమహేంద్రవరం), శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం) జాయింట్‌ కన్వీనర్‌గా, సభ్యులుగా శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ (మండపేట), శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేపల్లిగూడెం), శ్రీ యిర్రంకి సూర్యారావు (భీమవరం), శ్రీ గుణ్ణం నాగబాబు (పాలకొల్లు) సభ్యులుగా ఉంటారు.
3. సెంట్రల్‌ ఆంధ్ర సంయుక్త కమిటీ:
విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్‌ స్థానాలకు సెంట్రల్‌ ఆంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్‌ (కె.కె., గుంటూరు), జాయింట్‌ కన్వీనర్‌గా సయ్యద్‌ జిలానీ (నరసరావుపేట), సభ్యులుగా శ్రీ పోతిన వెంకట మహేష్‌ (విజయవాడ), అమ్మిశెట్టి వాసు (విజయవాడ), గాదె వెంకటేశ్వర రావు (గుంటూరు), శ్రీమతి పాకనాటి రమాదేవి (గుంటూరు) సభ్యులుగా ఉంటారు.
4 . రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ:
తిరుపతి, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు, ఈ కమిటీకి కన్వీనర్‌గా డా.పసుపులేటి హరిప్రసాద్‌, షేక్‌ రియాజ్‌ జాయింట్‌ కన్వీనర్‌గా, సభ్యులుగా డా.పొన్ను యుగంధర్‌ (గంగాధర నెల్లూరు), సయ్యద్‌ ముకరం చాంద్‌ (రాజంపేట), యగవింటి (మైఫోర్స్‌), మహేష్‌ (మదనపల్లి), మాసి కృష్ణమూర్తి (తిరుపతి), శ్రీమతి ఆరేటి కవిత (చిత్తూరు), గానుగపెంట శ్రీకాంత్‌ (నెల్లూరు) ఉంటారు.
5 . రాయలసీమ సంయుక్త కమిటీ:
అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాలకు రాయలసీమ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా టి.సి.వరుణ్‌ (అనంతపురం), సుంకర శ్రీనివాస్‌ (కడప) జాయింట్‌ కన్వీనర్‌గా, సభ్యులుగా చింతా సురేష్‌ (కర్నూలు), శ్రీమతి రేఖ గౌడ్‌ (ఎమ్మిగనూరు), ఆకుల ఉమేష్‌ (హిందూపురం), మలిశెట్టి వెంకటరమణ (కడప) ఉంటారు

Related Posts