వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్
.ఒక్క రోజుకే చుక్కలు చూపించిన కూరగాయల ధరలు
.ఒక్క రోజుకే చుక్కలు చూపించిన కూరగాయల ధరలు
హైదరాబాద్, మార్చి 23,
ప్రభుత్వ లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకుని లాభాలు ఆర్జించాలనుకుంటున్నారో లేక సప్లయి లేక రేటు పెరిగిందో కానీ హైదరాబాద్ లో కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. అన్ని రైతు బజార్లలో కూరగాయల రేట్లు పెంచి వ్యాపారులు అమ్ముతున్నారు. కూరగాయలు అమ్మేందుకు వస్తున్న రైతులకు మాత్రం మామూలు ధరలనే కూరగాయల వ్యాపారులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు - ఒక్కరోజు బంద్ తో రైతు బజార్లలో కూరగాయల స్టాకు రాలేదని చెప్పే అధిక ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారు. ఈ రోజు టమోటా 50/- కిలో, అల్లుగడ్డ 70/- కిలో, మిర్చి150/- కిలో, బీరకాయ 70/-కిలో, దోసకాయ 50/-కిలో, బెండకాయ 50/-కిలో, దొండకాయ 50/-కిలో చెబుతున్నారు.ఒక్కరోజు బంధ్ తో నే ధరలు ఇలా ఉంటే 31 వ తేదీ వరకు పరిస్తితి ఏలా ఉంటుంధో నన్న ఆంధొలనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
Related Posts