YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పాజిటివ్ లేదు బాబో...ఫేస్ బుక్ లో ఆవేదన

పాజిటివ్ లేదు బాబో...ఫేస్ బుక్ లో ఆవేదన

పాజిటివ్ లేదు బాబో...ఫేస్ బుక్ లో ఆవేదన
హైద్రాబాద్, మార్చి 26
కరోనా వైరస్‌‌ యువకులకు రాదని, వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువని ఇప్పటివరకు అంతా భావించారు. కానీ, అది కేవలం భ్రమ మాత్రమే అనేది ఓ బాధితుడు చెప్పిన స్వీయ అనుభవంతో తెలుస్తోంది. ఇటీవల యూకే నుంచి ఇండియాకు వచ్చిన ఓ యువకుడిలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. యూకే నుంచి వచ్చిన వెంటనే అతడు కుటుంబ, సభ్యులను మిత్రులను కలవకుండా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాడు. దీంతో వైద్యులు అతడిని మాత్రమే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుడు తనకు ఎదురైన పరిస్థితిని ‘ఫేస్‌బుక్’ ద్వారా వెల్లడించాడు. కరోనా వైరస్ తమను ఏమీ చేయదని ధైర్యంగా తిరిగే ప్రతి ఒక్కరికీ తన అనుభవం అవగాహన పాఠం కావాలంటూ.. తన పరిస్థితిని వివరించాడు.మార్చి 20న నేను ఇండియాకు వచ్చాను. ఈ సందర్భంగా వైద్యులు నా శాంపిల్స్ తీసుకున్నారు. రిపోర్టులో నాకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాను. కరోనా నుంచి నాకు ముందుగానే అవగాహన ఉండటం వల్ల నేను కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలవలేదు. దాని వల్ల మా ఇంట్లో ఎవరికీ ఐసోలేషన్ అవసరం రాలేదు’’ అని తెలిపారు. ఈ సందర్భంగా అతను కొన్ని షాకింగ్ వివరాలు చెప్పాడు. ఎయిర్ పోర్టులో కరోనా బాధితులు ఎలా తప్పించుకుంటున్నారో వివరించాడు’’.నాతో ప్రయాణించినవారిలో ఎక్కువ మంది లండన్ నుంచి వచ్చినవాళ్లే. విమానం ల్యాండింగ్‌కు కొన్ని గంటల ముందు వీరంతా పారాసెటమాల్ మాత్రలు వేసుకున్నారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, థర్మల్ స్కానింగ్‌లో ఆరోగ్యం ఉన్నట్లే చూపిస్తుంది. విదేశాల నుంచి వస్తున్న చాలామంది ఇదే విధానం పాటిస్తున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లలో కూడా తమకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని చెబుతున్నారు. క్వారంటైన్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందనే భయంతో వీరంతా అలా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు తమ కుటుంబ సభ్యులను కలవడం ద్వారా వ్యాధిని ఇతరులకు అంటిస్తారు. కాబట్టి.. ఆ వైరస్ మీ ఇంటి పక్కనే ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు’’ అని తెలిపాడు.కరోనా వైరస్ నిజంగానే మహమ్మారి అని బాధితుడు తెలిపాడు. కరోనా వైరస్ సోకిన ప్రతివారిలో లక్షణాలు కనిపించాలనే రూల్ లేదని, ఇందుకు తానే నిదర్శనమని తెలిపాడు. ‘‘మీరు అనుకుంటున్నట్లుగా ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ కాదు. ఈ వైరస్ సోకినా లక్షణాలు కనిపించవు. నాతోపాటు చికిత్స పొందుతున్న బాధితుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. లక్షణాలు కనిపించడం లేదు కదా, ఇది దీన్ని చాలా సులభంగా ఎదుర్కోవచ్చని మాత్రం అనుభావించవద్దు’’ అని పేర్కొన్నాడు. ఇంకా అతను ఏం చెప్పాడంటే..‘‘శరీరంలోకి చేరిన తర్వాత ఈ వైరస్ నెమ్మదిగా రోగ నిరోధక శక్తిని లోబరుచుకుంటుంది. అప్పటి నుంచి నెమ్మదిగా మీలో బలహీనత ఏర్పడుతుంది. మీ శరీరం దేనితోనో పోరాడుతున్న అనుభూతి కలుగుతుంది. అప్పుడే మీకు వైరస్ ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం నేను ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నా. కానీ, ఈ సమయంలోనే మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. వ్యాధిని జయించగలం అనే విశ్వాసాన్ని ఏర్పరుచుకోవాలి.‘‘నాలా విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న వ్యక్తుల వల్లే ఈ వైరస్ వస్తోంది. వీరిలో వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు చాలామంది ఉంటారు. వీరంతా చదువుకున్న వ్యక్తులే. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. విమానం దిగిన తర్వాత మీలో కరోనా వైరస్ లక్షణం ఒక్కటి కూడా కనిపించకపోవచ్చు. థర్మల్ స్క్రీనింగ్‌లో కూడా మీకు వైరస్ ఉందని చూపించకపోవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకుని మీకు వైరస్ లేదని భ్రమ పడకూడదు. ఎందుకంటే.. నాకు కూడా థర్మల్ టెస్టులో వైరస్ లేనట్లే చూపించింది’’.‘‘విమానాశ్రయంలో తనకు వైరస్ లేదని తేలిపోయిందనే ధైర్యంతో ఇంట్లోవారిని కలవడం చాలా ప్రమాదకరం. వీలైతే కొద్ది రోజులు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండండి. లేదా ఏమైనా అనుమానులు ఉంటే వైద్యులను సంప్రదించి హాస్పిటల్ వైద్య పరీక్షలు చేయించుకోండి. కొద్ది రోజులు ఒకే గదిలో కుర్చోండి. మీ వస్తువులను ఎవరినీ తాకవద్దని చెప్పండి. మీరు నియమాలను పాటిస్తే.. వందల.. వేల ప్రాణాలను కాపాడినవాళ్లు అవుతారు. లేకుంటే వారి ప్రాణాలను మీరు ప్రమాదంలోకి నెట్టివాళ్లవుతారు’’.ఈ వైరస్ తమలో ఉదందని తెలియక చాలా మంది సాధారణ జీవితం గడిపేస్తారు. వారికి తెలియకుండానే చనిపోతారు. ఈ చైన్‌ను తప్పకుండా బ్రేక్ చేయాలంటే.. విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వారిని కలిసినవాళ్లు తప్పకుండా క్వారంటైన్‌లో ఉండాలి. ఈ సమస్యతో హాస్పిటల్‌లో చేరేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు వైరస్‌ను ముందుగానే గుర్తించడం వల్ల ఎంతోమందికి ప్రాణాపాయం తప్పుతుంది. వైరస్ వ్యాప్తి ఆగుతుంది’’‘‘ప్రస్తుతం కరోనా వైరస్‌‌ను ఎదుర్కొంటున్న మిగతా దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా త్వరలో ఇండియాకు వస్తారు. వారి రాకను ఇండియా అడ్డుకోలేదు. ఎందుకంటే.. తమ దేశ ప్రజలు వేరే దేశాల్లో మీ చావు మీరు చావండని వదిలిపెట్టలేదు. దీంతో వారిని కూడా ఇండియాకు తీసుకొస్తారు. అయితే, వారికి కేవలం థర్మల్ స్క్రీనింగ్ చేసి వ్యాధి లేదని నిర్ధరించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తిని రక్త నమూనాను పరిశీలించి.. వారిలో కరోనా పాజిటివ్ లేదని తేలిన తర్వాతే వదిలిపెట్టాలి. అప్పటి వరకు ప్రభుత్వం వారిని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలి’’.‘‘తమ వద్ద వారందరినీ ఉంచేందుకు అవసరమైన పడకలు లేవని వదిలిపెట్టేయొద్దు. అలా చేస్తే మిలియన్ ప్రజల ప్రాణాలకు ముప్పు. వీలైతే యుద్ధం సమయంలో పాటించే ఎమర్జన్సీ చట్టాన్ని ప్రయోగించి ప్రైవేట్ హాస్పిటళ్లను ఆధీనంలోకి తెచ్చుకోండి. చైనా కొన్ని రోజుల వ్యవధిలోనే హాస్పిటల్ కట్టగలిగినప్పుడు.. మనం కనీసం కార్పొరేట్ హాస్పిటళ్ల ద్వారా సేవలు అందించలేమా? విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ క్వారంటైన్ విధించండి. చదువుకున్న వ్యక్తులు బాధ్యతగా ఉండటం లేదనడానికి ఇండియాలో నమోదవుతున్న ఈ కేసులే సాక్ష్యం. క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరిగేవారికి శిక్షలు, జరిమానాలు విధించండి’’ అని బాధితుడు తెలిపాడు. వరంగల్‌కు చెందిన బాధితుడు యూకేలో ఎడిన్బర్గ్‌లో ఉంటున్నాడు. ప్రైవసీ నిమిత్తం అతడి పూర్తి వివరాలను గోప్యంగా ఉంచాం.

Related Posts