YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు షాక్ ల మీద షాకులు

జగన్ కు షాక్ ల మీద షాకులు

జగన్ కు షాక్ ల మీద షాకులు
విజయవాడ, మే 23
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైకోర్టు షాకుల మీద షాకులిస్తోంది. ప్రతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో పార్టీలోనూ కలవరం బయలుదేరింది. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్లనేనా? మరేదైనా కారణమా? అన్నది పార్టీ సీనియర్ నేతలకు కూడా అంతుచిక్కకుండా ఉంది. హైకోర్టుకు వెళ్లిన ప్రతి కేసూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో ప్రభుత్వ అధికారులు సయితం ఆలోచనలో పడ్డారు.మత్తు డాక్టర్ సుధాకర్ అంశాన్ని సీబీఐకి ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటీషన్లు వేసినా నెలల తరబడి విచారణ చేసి తర్వాత సీబీఐకి హైకోర్టు అప్పగించింది. అయితే ఒక డాక్టర్ నడిరోడ్డుపై చిందులు వేస్తే అరెస్ట్ చేయడంపై సీబీఐకి అప్పగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. డాక్టర్ సుధాకర్ ను అరెస్ట్ చేసిన విధానాన్ని సమర్థించవచ్చు కాని, సీబీఐకి వెళ్లేంత సీన్ ఉందా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి.ఇక మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 8న ప్రభుత్వం ఏబీని సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ కూడా తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సయితం ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణ జరపాలని చెప్పింది. హైకోర్టులో మాత్రం ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. సస్పెన్షన్ కాలంలోనూ జీతం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరి ఆయన పై జరుగుతున్న విచారణ పై ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేదు.దీనిని బట్ట ముఖ్యమంత్రి జగన్ సర్దుకోవడమే బెటర్ అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రానున్న కాలంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం ఉంది. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసి ఉంది. అలాగే మూడు రాజధానుల అంశం కూడా హైకోర్టులో ఉంది. ఇక ప్రతి విష‍యంలోనూ జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా లేకుంటే హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు తప్పవు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి 64 కేసుల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. ఇప్పటికైనా తప్పు ఎక్కడ ఉందో తెలుసుకోవడం.. దానిని సరిదిద్దుకోవడం బెటర్ అంటున్నారు. లేకుంటే నాలుగేళ్ల పాటు న్యాయస్థానం చేతిలో నలగక తప్పదు.

Related Posts