YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ములుగు జిల్లా కలెక్టర్ ని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

 ములుగు జిల్లా కలెక్టర్ ని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

జిల్లా కలెక్టర్ ని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ములుగు మే 23
ములుగు నియోజకవర్గం లోని కొత్తగూడ  గంగారాం మండలాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.  శుక్రవారం రోజున మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కు వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఈ సందర్బంగా సీతక్క  మాట్లాడుతూ  మహబూబాబాద్ జిల్లా ఉన్న కొత్తగూడ గంగారాం మండలాలు ములుగు నియోజకవర్గం పరిధి లోనివాని పూర్తిగా ఏజెన్సీ గ్రామాలని ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం మొక్కజొన్న పంట మీదనే ఆధారపడి  జీవనం సాగిస్తున్నారని సరైన నీటి వనరులు విద్యుత్తు వసతులు లేక పూర్తిగా కొండలు,గుట్టలు కలగలసిన నెల ఉంటుందని ఈ భూములలో మొక్కజొన్న తప్ప వేరే ఇతరత్రా పంటలకు అవకాశం లేదని రాష్ట్రముఖ్య మంత్రి  ప్రకటన చుసిన రెత్తులు ఆందోళన చెందుతున్నారని కావున కొత్తగూడ గంగారాం మండల లో మొక్క జొన్న పంట సాగు చేసుకొనుటకు అనుమతించాలనికలెక్టర్ ని కోరారు. అదే విధంగా  కొత్తగూడ నుండి దుబ్బగూడెం కు రోడ్డు సాంక్షన్ అయినప్పటికీ ఫారెస్ట్  అధికారులు రోడ్డు పనులు చేయకుండా అడ్డుకుంటున్నారాని. అధికారులతో మాట్లాడి వెంటనే  రోడ్డు పనులు పూర్తిఅయేవిదంగా చొరవ చూపాలని కలెక్టర్ ను కోరారు ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులూ చుక్కల ఉదయ్ చందర్,ఉమా మురళి నాయక్ పట్టణ అధ్యక్షులు రాజన్న గౌడ్,యస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బానోత్ ప్రసాద్ నాయక్,కొత్తగూడ గంగారాం మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,జాడి వెంకటేశ్వర్లు,జడ్పీటీసీ పుష్పలత-శ్రీనివాస్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకరబోయిన  మొగిలి ,మాజీ జడ్పీటీసీ కందిమల్ల మధుసూదన్ రెడ్డి,గంగారాం జడ్పీటీసీ ఈసం రమ-సురేష్,కోప్షన్ సభ్యులు ఎండీ సయ్యద్, యస్ కె సయ్యద్,సర్పంచ్ ఈసం సమ్మయ్య,చింత సారమ్మ రాధారపు కొమురమ్మ,తదితరులు పాల్గొన్నారు

Related Posts