YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనాతో మారుతున్న రూపురేఖలు

కరోనాతో మారుతున్న రూపురేఖలు

కరోనాతో మారుతున్న రూపురేఖలు
న్యూఢిల్లీ, మే 23,
కరోనా వైరస్‌తో బరువు కూడా తగ్గిపోతారా? మొత్తం రూపు రేఖలే మారిపోతాయా? కాలిఫోర్నియాకు చెందిన కరోనా వైరస్ బాధితుడు మైక్ స్కుల్జ్ అనుభవం గురించి తెలిస్తే అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన కరోనా వైరస్ సోకిన ఆరు వారాల్లో 20 కిలోల బరువు తగ్గిపోయాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో నర్సుగా పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తి.. ఇటీవలే అతడి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పేందుకు వ్యక్తి  తన శరీర మార్పుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. లేవడానికి కూడా ఓపిక లేని అతడు వైద్య సిబ్బంది సహాయంతో అద్దం వద్ద నిలుచుని ఫొటో తీసుకున్నాడు. అనంతరం కరోనా వైరస్‌కు ముందు, ఆ తర్వాత అంటూ రెండు ఫొటోలు పెట్టాడు. ఈ ఫొటోలను చూస్తే తప్పకుండా షాకవుతారు. ఎందుకంటే.. కరోనాకు ముందు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన అతను . వైరస్ సోకిన తర్వాత బక్క చిక్కిపోయాడు.కరోనాకు ముందు తాను 86 కిలోల బరువు ఉండేవాడినని, ఇప్పుడు 63 కిలోలకు తగ్గిపోయానని మైక్ తెలిపాడు. ఈ సందర్భంగా అతను  మాట్లాడుతూ.. ‘‘కరోనా వల్ల ఆరు వారాలుగా వెంటిలేటర్ మీదే ఉన్నాను. నా దయనీయ స్థితి ప్రతి ఒక్కరికీ తెలియాలనే ఈ ఫొటో షేర్ చేస్తున్నా. కోవిడ్-19 నా ఊపిరితీత్తుల సామర్థ్యాన్ని నాశనం చేశాయి. అద్దంలో చూసుకోగానే నన్ను నేను గుర్తుపట్టలేకపోయా. నా పరిస్థితి చూసి ఏడుపొచ్చేసింది’’ అని తెలిపాడు. మార్చి నెలలో మియామీ బీచ్‌లో జరిగిన ఓ పార్టీలో పాల్గొన్న మైక్ కరోనా వైరస్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి అతడు హాస్పిటల్‌లోనే ఉంటున్నాడు. తిరిగి అతడు సాధారణ స్థితికి చేరడానికి, ఊపిరి పీల్చుకోడానికి మరో నాలుగు వారాలు పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. చూశారుగా.. కరోనా ఎంత ప్రమాదకారో. కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి.

Related Posts