YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విక్టరీ వెంకటేష్ చేతికి బ్లాక్ బ్లస్టర్..

విక్టరీ వెంకటేష్ చేతికి బ్లాక్ బ్లస్టర్..

విక్టరీ వెంకటేష్ చేతికి బ్లాక్ బ్లస్టర్..
హైద్రాబాద్, మే 26,
విక్టరీ వెంకటేష్ కెరీర్‌ను మరో మలుపు తిప్పిన సినిమా ‘శత్రువు’. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న వెంకటేష్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇది. 1991 జనవరి 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇది ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజుకి తొలి చిత్రం. నిజానికి ఈ సినిమాను హ్యాండ్‌సమ్ హీరో శోభన్‌బాబుతో చేయాలని అనుకున్నారట ఎం.ఎస్.రాజు. కానీ, శోభన్‌బాబు అంగీకరించకపోవడంతో కథ వెంకటేష్ వద్దకు వెళ్లింది. అయితే, దీని వెనుక ఓ చిన్న కథ ఉంది. అదేంటో ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి తెలుసుకుందాం. ఎం.ఎస్.రాజు తండ్రి అయ్యప్ప రాజు కూడా నిర్మాత. వీరి కుటుంబంతో శోభన్‌బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, తండ్రి మాదిరిగానే తాను కూడా నిర్మాత అవుదామని ఎం.ఎస్.రాజు నిర్ణయించుకున్నారు. ఆయనే ఒక కథ రాసుకున్నారు. అదే ‘శత్రువు’. ఈ స్టోరీ లైన్ అనుకోగానే తన మదిలో మెదిలిన మొదటి హీరో శోభన్‌బాబు. ఆయన ఎలాగూ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఎం.ఎస్.రాజు కలిశారట. శోభన్‌బాబుకు కథ చెప్పారట. కథ బాగుంది కానీ తాను చేయలేనని శోభన్‌బాబు సున్నితంగా తిరస్కరించారటఅంతేకాదు, సినిమాల్లోకి ఎందుకు కెరీర్ పాడవుతుంది.. ఏదైనా వ్యాపారం చేసుకోమని రాజుకు శోభన్‌బాబు సలహా కూడా ఇచ్చారట. ‘‘ఈ సినిమా ఆడితే ఫర్వాలేదు.. ఒకవేళ నష్టాలు వస్తే మళ్లీ మన మధ్య మనస్పర్థలు వస్తాయి.. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నీతో సినిమా చేయలేను’’ అని శోభన్‌బాబు ఎం.ఎస్.రాజుకు నిర్మొహమాటంగా చెప్పేశారట. శోభన్‌బాబు తిరస్కరించినా.. ఈ సినిమా చేయాలనే కోరిక మాత్రం ఎం.ఎస్.రాజులో బలంగా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌తో చేయాలని ఎం.ఎస్.రాజు నిర్ణయించుకున్నారట.అయితే, అప్పటికి వెంకటేష్ కెరీర్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నారు. వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. మరోవైపు, అక్కినేని నాగార్జున దూసుకుపోతున్నారు. దీంతో చాలా మంది సన్నిహితులు ఈ సినిమాను నాగార్జునతో చేయమని రాజుకు సలహా ఇచ్చారట. కానీ, రాజు మాత్రం వెంకటేష్ అని బలంగా నిర్ణయించుకున్నారు. వెంటనే, వెంకటేష్ తండ్రి, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడిని రాజు కలిశారట.వెంకటేష్‌తో సినిమా చేస్తాను.. కాల్షీట్లు కావాలని రామానాయుడిని అడిగారట. ఆఖరికి రామానాయుడు కూడా వెంకటేష్‌తో వద్దని చెప్పారట. వెంకటేష్‌కు మంచి హిట్ వచ్చిన తరవాత చేద్దురులెండి అని రామానాయుడు సలహా ఇచ్చారట. అయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా ఎం.ఎస్.రాజు ప్రయత్నించారు. మొత్తానికి రామానాయుడిని ఒప్పించి, వెంకటేష్‌తో ‘శత్రువు’ తీసి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు రాజు.సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యంమూర్తితో కలిసి ‘శత్రువు’ కథను ఎం.ఎస్.రాజు డెవలప్ చేశారు. ఈ సినిమాకు మాటలు కూడా సత్యంమూర్తి రాశారు. అప్పటికి ఫుల్ ఫామ్‌లో ఉన్న కోడి రామకృష్ణను దర్శకుడిగా తీసుకున్నారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. వెంకటేష్ సరసన విజయశాంతి హీరోయిన్‌గా నటించారు. విలన్‌గా నటించిన కోట శ్రీనివాసరావు తన నటనలోని మరో మేనరిజాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు. మొత్తం మీద ఎం.ఎస్.రాజు ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో నిర్మాతగా తన కెరీర్‌ను మొదలుపెట్టి ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటాన’ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.

Related Posts