YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దళితుల మాత రమాబాయి అంబేద్కర్

దళితుల మాత రమాబాయి అంబేద్కర్

దళితుల మాత రమాబాయి అంబేద్కర్
నందికొట్కూరు,  మే 27
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి దళితుల మాత రమాబాయి అంబేద్కర్ అని మాలమహానాడు నాయకులు అన్నారు. బుధవారం పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో రమాబాయి అంబేద్కర్ 85వవర్ధంతి  సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాలూకా మాల మహానాడు అధ్యక్షులు పబ్బతి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి వాడాల శేషు ల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీ దంత వైద్యశాల అధినేత డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు చేదోడువాదోడుగా ఉంటూ ఆమె సహకరించడంతో ని రాజ్యాంగ రచన తో పాటు ఉన్నత చదువులలో కూడా అంబేద్కర్ గొప్ప విజయం సాధించారన్నారు. ఆనాడు ఆ తల్లి ఓర్పు సహనంతో బిఆర్ అంబేద్కర్ కు సహకరించడంతో తన జాతి అభివృద్ధి కోసం భారత రాజ్యాంగ రచనలో విద్య ఉద్యోగాలు రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించి నేటి దళిత జాతి ఉన్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. జాతి విముక్తి కోసం అంబేద్కర్ పోరాటం లో మాత రమాబాయి అంబేద్కర్ చేసిన కృషిని మరువలేనిదన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లిన సమయంలో ఆ తల్లిసమయస్ఫూర్తి తో కుటుంబ పోషణ తో అంబేద్కర్ చదువుల కై డబ్బులను పంపించిన అటువంటి మహా తల్లి ఆమె అన్నారు  ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు పడిగెల నాగేంద్ర,  బొల్లవరం మనోహర్, హుస్సేన్ అలం, పేరు మాల మధు, పరమేష్, కూన నాగన్న, జయరాజు, తమ్మడపల్లి ఏసేపు తదితరులు పాల్గొన్నారు
 

Related Posts