YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

పోలీసులపై రౌడీ మూకల కాల్పులు

పోలీసులపై రౌడీ మూకల కాల్పులు

పోలీసులపై రౌడీ మూకల కాల్పులు
లక్నో, 
ఉత్తరప్రదేశ్‌లో రౌడీ మూకలు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఓ డిప్యూటీ ఎస్పీ సైతం ఉన్నారు. కరుడగట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకోడానికి బికారు గ్రామంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకోగా.. అతడి అనుచరులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ సహా ఎనిమిది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.క్రిమినల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాల్పలు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్‌సీ అవస్థీని ఆదేశించారు. దీనిపై నివేదికను అందజేయాలని సూచించారు.కరుడ గట్టిన నేరస్థుడు వికాస్ దూబే కోసం డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ దేవెందర్ మిశ్రా ఆధర్వంలోని పోలీసుల బృందం బికారు గ్రామానికి శుక్రవారం తెల్లవారుజామున చేరుకుని సోదాలు నిర్వహిస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. విచక్షారహితంగా కాల్పులు జరపడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరికొందరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.దాదాపు 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి గురువారం రాత్రి పోలీసులు అక్కడకు చేరుకోగా.. అతడి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడి అనుచరులు కాల్పులుకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.

Related Posts