YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ముక్కుపుడక కోసం మృతదేహాన్ని తవ్వారు

ముక్కుపుడక కోసం  మృతదేహాన్ని తవ్వారు

మెదక్, జూలై 3, మెదక్‌లో దారుణం చోటు చేసుకుంది. బంగారు ముక్కు పుడకల కోసం ఖననం చేసిన మృతదేహాన్ని తవ్వి బయటకు తీశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ అనే వృద్ధురాలు జూన్ 24న అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం.. స్థానిక శ్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు.పోచమ్మ మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ముక్కు పుడకలు ఉండటాన్ని కాటికాపరి సంబంధీకులు గమనించారు. గురువారం మృతదేహాన్ని వెలికి తీసి రెండు ముక్కు పుడకలను తీసుకునే ప్రయత్నం చేశారు. అటుగా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారువిషయం తెలుసుకున్న మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సొమ్ము కోసం కక్కుర్తి పడతారని తెలుసు గానీ మరీ ఈ రేంజ్‌లో కక్కుర్తి పడతారని మాత్రం ఎవరూ ఊహించరంటూ.. శవాన్ని బయటకు తీసిన ఘటన పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts