YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మీ పరాక్రమం గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది : ప్రధాని

మీ పరాక్రమం గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది : ప్రధాని

శ్రీనగర్, జూలై 3, ప్రధాని మోదీ లడఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. సైనికుల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపారు. ప్రధాని చర్యతొో చైనా ఉలిక్కి పడుతోంది. ఘాటు వ్యాఖ్యలు చేసింది.చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మికంగా పర్యటించారు. సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి శుక్రవారం (జులై 3) ఉదయం లడఖ్‌లోని ‘నిము’ సైనిక స్థావరాన్ని సందర్శించారు. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో గాయపడిన జవాన్లను పరామర్శించారు. వారి ధైర్యాన్ని ప్రశంసించారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రధాని ల‌డఖ్ ప‌ర్యటనతో చైనా ఉలిక్కిప‌డుతోంది. మోదీ పర్యటనపై చైనా ఘాటుగా స్పందించింది. దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్న వేళ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం సరైంది కాదని పేర్కొందిచైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చావో లిజియాన్‌ శుక్రవారం ఉద‌యం.. స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ల‌డఖ్ పర్యటన గురించి నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.‘సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను త‌గ్గించ‌డానికి భార‌త్‌ - చైనా మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇరుదేశాలకు చెందిన సైనికాధికారులు సంప్రదింపుతు జరుపుతున్నారు. అటు దౌత్యపరంగానూ చ‌ర్చల ప్రక్రియ‌ను కొన‌సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఇరుదేశాల‌కు చెందిన ఏ ఒక్కరూ ప‌రిస్థితిని మ‌రింత ఉద్రిక్తంగా మార్చే ఎలాంటి చ‌ర్యలకూ పాల్పడవద్దు’ అని చావో లిజియాన్ వ్యాఖ్యానించారు.సైనికుల సాహస గాథలు దేశంలోని ప్రతి ఇంటినీ చేరాయి. శత్రువులకు మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు. లడఖ్‌లో గాలి, నీరు, ఇక్కడి రాళ్లు.. దేన్ని అడిగినా మీ వీరత్వం గురించే చెబుతున్నాయి. ప్రపంచం మొత్తానికి భారత్‌ శక్తి సామర్థ్యాలు నిరూపించాం..మరోవైపు.. లడఖ్‌లో సైనికులను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని.. బలహీనులు శాంతిని సాధించలేరని వ్యాఖ్యానించారు. సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను భారత్ వేగవంతం చేసిందని చెప్పారు. అనేక అస్త్రశస్త్రాలు నిర్మిస్తుందని చెప్పారు. సంక్లిష్ట సమయాల్లో ప్రపంచం వెంట భారత్ నడిచిందన్నారు. అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు. మోదీ పర్యటన జవాన్లలో మరింత ధైర్యం నింపింది.
మనం వేణువు ఊదే కృష్ణుడిని పూజిస్తాం.. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడినీ ఆరాధిస్తాం. సామ్రాజ్యవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి పథాన సాగాల్సిన సమయం. ఇంతకాలం విస్తరణ కాంక్షతో సాగిన శక్తులు తోకముడవడమో లేదా ఓటమో చవిచూడటమో జరిగాయి. దీనికి చరిత్రే సాక్ష్యం.
లడఖ్‌లో ప్రధాని మోదీ
‘ఈ భూమి వీర భూమి. వీరులను కన్న భూమి. బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరు.. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుంది. మన సంకల్పం హిమాలయాల కంటే ఎత్తైంది. వేల ఏళ్ల నుంచి ఎన్నో దాడులను మనం తిప్పికొట్టాం. ఇవాళ భారత్‌ శక్తి సామర్థ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్ష విభాగాల్లో మన శక్తి సమున్నతం. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుంది. బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరు. అనేక సంక్లిష్ట, సంక్షోభ సమయాల్లో ప్రపంచం వెంట భారత్‌ నడిచింది. ప్రపంచ యుద్ధాల్లోనైనా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్య సాహసాల్ని చూసింది’ అని మోదీ అన్నారు.

Related Posts