YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అన్ని రంగాల్లోముదిరాజులు అభివృద్ధిలోకి రావాలి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లోకన బోయిన రమణ ముదిరాజ్

అన్ని రంగాల్లోముదిరాజులు అభివృద్ధిలోకి రావాలి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లోకన బోయిన రమణ ముదిరాజ్

హైదరాబాద్ జూలై 4
బలహీనంగా ఉన్న పేద ముదిరాజులను అభివృద్ధిలోకి తీసుకురావడమే తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లోకన బోయిన రమణ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని అల్వాల్ లో తెలంగాణ ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ మహిళా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి, ప్రధాన కార్యదర్శి గా ఈగ లావణ్య కృష్ణ, ఉపాధ్యక్షురాలిగా సరికొండ సుభాషిని, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలిగా కట్టెల శారద, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గా విందకోట దీపిక లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు మత్స్యకారులకు మహిళలకు చాలా అన్యాయం జరుగుతుందని వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ముదిరాజులకు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మెరుగు నరసయ్య ముదిరాజ్, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు వాడపల్లి సత్యనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షురాలు పుష్పలత, గ్రేటర్ హైదరాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ రేణుక, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు నిర్మల ముదిరాజ్, గ్రేటర్ హైదరాబాద్ బైరమల్ జగదీశ్వరి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిరా, సుజాత, సోనీ, మాధవి, దేవి తదితరులు పాల్గొన్నారు

Related Posts