YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్తగూడెంలో సమ్మె

కొత్తగూడెంలో సమ్మె

భద్రాద్రి కొత్తగూడెం జూలై 4
సింగరేణి సమ్మె కొత్తగూడెం లో మూడో రోజు జరిగింది. చివరి రోజు  సమ్మెలో గుర్తింపు సంఘం అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పాల్గొనకపోవడంతో కొద్ది మంది కార్మికులు విధులకు హాజరు కావడంతో సమ్మె పాక్షికంగా కొనసాగింది.  గుర్తింపు సంఘానికి చేందిన కార్మికులు విధులకు హాజరు కావడటంతో జాతీయ సంఘాల నాయకులు,  సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సింగరేణి ఏరియా వర్క్ షాప్  కు వచ్చారు. అక్కడి  కార్మికులను   మీరు ఈ రోజు చివరి రోజు సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  సమ్మె నేపథ్యంలో  భూగర్భ,  ఓ సి  గనుల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాజమాన్యం ముందు జాగ్రత్తగా పోలీసులను,  ఎస్.అండ్ పి.సి. ల సహాయం తో భూగర్భ గనుల లోకి కార్మికులు వెళ్ళేందుకు గట్టి చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సి పిఐ  రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలవల్లా సింగరేణి మనుగడ దెబ్బ తినే ప్రమాదం ఉందని అన్నారు.  కార్మికుల హక్కులకై పోరాటం చేస్తూ కార్మికుల పక్షాన పోరాటం చేయాల్సిన గుర్తింపు సంఘం నాయకులు కార్మికులు విధులకు హాజరు కావాలంటూ బొగ్గు గనుల వద్ద ప్రచారం చేయటం మంచి పరిణామం కాదని విమర్శించారు.  ఇప్పటికైనా సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ కార్మిక సంఘం కార్మికుల నిజమైన హక్కుల కోసం పోరాడుతున్న జాతీయ సంఘాలతో కలిసి నడిసి సింగరేణి బొగ్గు బ్లాకులను రక్షించి కార్మికుల నిజమైన హక్కులను సాధించే దాంట్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Related Posts