YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలి

కడప జూలై 4
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పట్టణంలో  పచ్చదనాన్ని పెంపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాష పేర్కొన్నారు. శనివారం ఉప ముఖ్యమంత్రి  సింగపూర్ సిటీలో మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  మాట్లాడుతూ మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయన్నారు. మొక్కల వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ మొక్క యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఖాళీ ప్రాంతాలలో ఇంటి పరిసర ప్రాంతాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. పట్టణంలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుందని కాలుష్యాన్ని నివారించాలంటే తప్పకుండా మొక్కలు నాటాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటడం వల్ల అవి బాగా పెరిగే అవకాశం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో డిఎస్పి సూర్యనారాయణ, సింగపూర్ టౌన్ టౌన్ షిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి, మరియు సభ్యులు రమణయ్య, విశ్వనాథరెడ్డి, గుర్రప్ప, 31 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, డాక్టర్ రామ్ మోహన్ రెడ్డి, డాక్టర్ నారాయణ రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు దాసరి శివప్రసాద్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts