YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి లోనే రాష్ట్ర రాజధాని కొనసాగించాలి

అమరావతి లోనే  రాష్ట్ర రాజధాని కొనసాగించాలి

నెల్లూరు జూలై 4
అమరావతి లొనే రాజధానిని  కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమము 200 రోజులకు చేరుకున్న సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో  ఈ ఉద్యమములో అశువులు బాసిన 66 మంది రైతులకు నివాళులు అర్పించి తదనంతరం కోవిద్ నిబంధనలు కు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఆందోళన చేయడము జరిగింది.ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజధానిగా అమరావతి అందరకీ అనువైన ప్రదేశం అని దానికి నేను మద్దతు ఇస్తున్నానని ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి  అసంబ్లీలో చెప్పి నేడు ముఖ్యమంత్రి హోదాలో మాట తప్పారు.ఎన్నికల ప్రచార సందర్భంగా రాజధానిని అమరావతి లొనే కొనసాగిస్తానని చెప్పి నేడు మడమ తిప్పారు.
మాట్లాడితే మా నాయకుడు మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పే వైసీపీ నాయకులు దీనికి ఏమి చెప్తారు.నెల్లూరు కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి కంటే 600 కిలోమీటర్ల పైగా ఉన్న విశాఖ రాజధాని అయితే నెల్లూరు జిల్లాకు వచ్చే ప్రయోజనం ఏమిటో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పాలి.250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి లో కంటే నెల్లూరు నుండి 350 కిలోమీటర్ల ఉండి సరైన రవాణా సౌకర్యం లేని కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేస్తే మన జిల్లాకు వచ్చే ఉపయోగం ఏమిటో చెప్పాలి.మూడు రాజధానులు పేరుతో అమరావతి లో నిర్మాణంలో ఉన్న కట్టడాలను అపి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.ప్రజా రాజధాని అమరావతి ని కొనసాగించాలని కోరుతూ గత 200 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం దేశ చరిత్రలోనే మహత్తరమైన ఉద్యమం,ఈ ఉద్యమములో రాజకీయాలకు సంభందం లేని మహిళలు చేసిన పోరాటం స్ఫూర్తి దాయకం.రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని పెద్దలు చెపుతుంటారు కావున ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  ఇప్పటికైనా రైతుల కంట కన్నీరు పెటించకుండా అమరావతిలొనే రాజధానిని కొనసాగించాలని అన్నారు.

Related Posts