YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వికేంద్రీకరణతోనే అభివృద్ధి

వికేంద్రీకరణతోనే అభివృద్ధి

విజయవాడ జూలై 4
ఏం అన్యాయం జరిగిందని చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం.  వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధిచెందుతాయి.  ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిని ఎందుకు కట్టలేక పోయారు?  ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?  కర్నూలు న్యాయ రాజధానిని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అయన నిలదీసారు. అమరావతి డిజైన్లకే రూ.800 కోట్లు ఖర్చు పెట్టార. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. రాష్ట్రాన్ని మీకేమైనా రాసిచ్చారా? .. చంద్రబాబూ అని అడిగారు. చంద్రబాబూ.. అంతా మీరు చెప్పినట్లుగానే జరగాలనే రూల్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉన్న ప్రజలకు హక్కులు లేవా?  శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణ అవసరమని చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. ఒక్క అమరావతిపైనే చంద్రబాబు ఎందుకు ప్రేమ చూపించారు..? ఇందులో మర్మమేమిటని ప్రశ్నించారు.

Related Posts