YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి ఎర్రబెల్లి జన్మధినం సందర్బంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే నన్నపునేని

మంత్రి ఎర్రబెల్లి జన్మధినం సందర్బంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే నన్నపునేని

వరంగల్ జూలై 4
పంచాయతీ రాజ్& గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  జన్మదినం సందర్బంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్పోరేటర్లతో కలిసి  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మొక్కలు నాటారు. వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్ లో కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు..  ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సుదీర్గకాలంగా ప్రజాసేవలో ఉంటున్న మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారన్నారు..జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్దికి పాటుపడుతున్న మంత్రి గారు ఆయురారోగ్యాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని,జిల్లాను అభివృద్దిలో ప్రధమ స్థానంలో నిలపాలని కాంక్షిస్తూ వారికి తూర్పు నియోజకవర్గ పక్షాన ఈ రోజు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపామని ఎమ్మెల్యే అన్నారు..

Related Posts