YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

65శాతం మంది పిల్లలచేతుల్లో మొబైల్ ఫోన్స్

65శాతం మంది పిల్లలచేతుల్లో మొబైల్ ఫోన్స్

65శాతం మంది పిల్లలచేతుల్లో మొబైల్ ఫోన్స్
ఒక సర్వేలో వెలుగు చుసిన ఆందోళనకరమైన విషయాలు
జైపూర్‌ 
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు. ఆపై ఆన్‌లైన్‌ క్లాసులు. దీంతో 65శాతం మందికి పైగా పిల్లలు ఫోన్‌ విడిచి అరగంట కూడా ఉండడ లేదట..! ఫోన్‌ వద్దని వారిస్తున్న తల్లిదండ్రులపట్ల చిరాకుగా, కోపంగా ప్రవరిస్తున్నారట. మరీ గట్టిగా బెదిరిస్తే ఏడుస్తున్నారట. మొబైల్‌ వీడేది లేదని మొండికేస్తున్నారట. ఈ విషయాలు రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌ జేకే లోన్‌ దవాఖాన వైద్యులు నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి.కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ప్రభావం పిల్లలపై ఎలా ఉంది? అని ఈ దవాఖాన వైద్యులు  ఒక సర్వే చేపట్టారు. కాగా, ఇందులో ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. 65.2 శాతం మంది పిల్లలు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. అలాగే, 23.40 శాతం మంది బరువు పెరిగారని, 26.90 శాతం మంది తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. 22.40 శాతం మంది కళ్ల నొప్పి, కళ్ల దురదతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. వాస్తవానికి, లాక్‌డౌన్‌ రోజుల్లో అధిక స్క్రీన్ ఎక్స్‌పోజర్‌ వల్ల 70.70 శాతం మంది విద్యార్థులు ప్రవర్తనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. 23.90 శాతం మంది వారి దినచర్యలను మానేశారు. 20.90 శాతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 36.80 శాతం మొండిగా మారారు. 17.40 శాతం మందిలో శ్రద్ధ తగ్గినట్లు వైద్యులు తేల్చారు. పీడియాట్రిక్స్ విభాగం మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ గుప్తా ఈ సర్వే చేపట్టారు. ఆయన నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని డాక్టర్ రమేశ్‌చౌదరి, డాక్టర్ ధన్‌రాజ్‌ బాగ్రి, డాక్టర్ కమలేశ్‌ అగర్వాల్, డాక్టర్ వివేక్ అత్వానీ, డాక్టర్ అనిల్‌శర్మ నిర్వహించారు.  వీరు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫాంలు, సోషల్ మీడియాలో డేటా సేకరించారు. రాజస్థాన్‌లోని ప్రధాన నగరాలైన జైపూర్, జోధ్‌పూర్‌, కోటా, ఉదయపూర్, అజ్మీర్, గంగనగర్, భిల్వారా, సికార్, చురు, అల్వార్, హనుమాన్‌నగర్‌, నాగౌర్, భరత్‌పూర్‌లో నివసిస్తున్న తల్లిదండ్రులు, సుమారు 55 శాతం మంది మంది బాలురు, 45 శాతం మంది బాలికలకు సంబంధించిన సమాచారాన్ని వీరితో పంచుకున్నారు. , అలాగే, ఢిల్లీ, ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబై, ఆగ్రా, లక్నో, ఛండీగఢ్‌లాంటి నగరాల్లోని పిల్లలు ఇంట్లో అందుబాటులో ఉన్న మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లను ఉపయోగించారని, వీటిలో మొబైల్‌ ఎక్కువగా వాడినట్లు సర్వేలో వెల్లడయ్యింది.  చాలా పాఠశాలలు, సగటున రోజుకు 1-8 గంటలు ఆన్‌లైన్ తరగతుల్లో పిల్లలను నిమగ్నం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు  పిల్లలు స్క్రీన్‌ చూసే సమయాన్ని పెంచారని, శారీరక శ్రమను తగ్గించారని సర్వేలో తేలింది.  దీంతో 50 శాతం మంది పిల్లలు 20 నుంచి 60 నిమిషాలు పడుకున్న తర్వాత నిద్రించేందుకు ఇబ్బంది పడుతున్నారని, 17 శాతం మంది పిల్లలు రాత్రి నిద్రలోనుంచి లేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.  వారిలో తలనొప్పి, చిరాకు, బరువు పెరగడం, శరీరం, వెన్నునొప్పిలో మార్పు, మరుగుదొడ్డి అలవాట్లలో చేంజ్‌ కనిపిస్తున్నాయని గుర్తించారు.  మూడింట రెండొంతుల మంది పిల్లల్లో ప్రవర్తనా మార్పులు కనిపిస్తున్నట్లు తేల్చారు.  దీంతోపాటు ఆన్‌లైన్ తరగతుల డిమాండ్‌ను తీర్చేందుకు సుమారు 38 శాతం కుటుంబాలు కొత్త పరికరాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది వారిపై కొంత ఆర్థిక భారాన్ని మోపింది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు సర్వేలో వెల్లడైంది. ఇప్పటికైనా పిల్లల స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ సమయాన్ని తగ్గించకుంటే భవిష్యత్తులో పిల్లలు అతిపెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.  

Related Posts