YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గా కిషన్ రెడ్డి

రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గా కిషన్ రెడ్డి

జగిత్యాల జూలై 04 
రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గా జగిత్యాల జిల్లాకు చెందిన  జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు  ఎన్నం కిషన్ రెడ్డి ని నియమించినట్లు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నందికొండ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  ఈమేరకు శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.  ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతమున్న రెడ్డి సంఘాలన్నింటిని  రెడ్డి జేఏసీ లో విలీనం చేసేవిధంగా కృషి చేయాలని తెలిపారు.  వీలీనమయ్యే రెడ్డి సంఘాల నాయకులకు, కార్యవర్గానికి హోదాకు తగ్గకుండా రెడ్డి జేఏసీ నూతన కమిటీ,  అనుబంధ విభాగాల్లో సముచిత స్థానం కల్పించేలా కృషి చేయాలని ఆదేశించారు.   కులం ఒకటే.. సంఘం ఒకటే అనే నినాదంగా రెడ్డి జేఏసీ  ఆవిర్భవించాలని దానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని  శ్రీనివాస్ రెడ్డి కోరారు.  రెడ్డి జేఏసీ పటిష్టతకు పాటుపడతా  జాతీయ, రాష్ట్ర రెడ్డి జేఏసీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని  ఈ సందర్భంగా ఎన్నం కిషన్ రెడ్డి తెలిపారు.  నాపై నమ్మకముంచి  రాష్ట్ర కార్యదర్శి గా నియమించిన  జాతీయ, రాష్ట్ర రెడ్డి జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.  రెడ్డి సంఘం పటిష్టతకు పాటుపడతానని, నా నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి  కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Related Posts