YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే

తెలంగాణ ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే

హైదరాబాద్ జూలై 4, 
టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన తెలిపామని, కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఒక్క బ్యారల్ ధర 40 డాలర్లు ఉండేదని, అప్పుడు పెట్రోల్ ధర రూ. 30, డీజిల్ ధర రూ. 25 మాత్రమే ఉండేదని ఉత్తమ్ అన్నారు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్లో 40 దాలర్లే ఉందని, అయినా ధర రూ. 80 రూపాయలు మించిందని, ఎక్సైజ్ సుంకాన్ని మోడీ ప్రభుత్వం 20 సార్లు పెంచిందని, రూ. 18 లక్షల కోట్లు రాబట్టుకుందని ఉత్తమ్ విమర్శించారు. 6న అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రాల్లో లాక్ డౌన్ లో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే అని, ప్రాజెక్టుల పేరుతో లూటీ జరుగుతోందని మండిపడ్డారు. పనుల్లో నాణ్యతలేదని, సీఎం ఫామ్ హౌస్ గేటుకు అనుకునే తెగిన కాలువ ఉందని, కాలువలు తెగుతాయి అనడానికి అధికారులకు సిగ్గుండాలన్నారు. ఈఎన్సీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని, అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రాజెక్టు పనులను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఉపేందర్ రెడ్డికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టు పనుల నాణ్యత లోపాలపై అన్ని కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. రూ. 2600 కోట్ల దుమ్ముగూడెం ప్రాజెక్టు టెండర్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు దోపిడీ జరుగుతోందని, చీఫ్ సెక్రటరీ కి లేఖ రాశామని, స్పందించక పోతే ఆయన పాత్ర కూడా అందని భావించాల్సి ఉంటుందని ఉత్తమ్ అన్నారు. మెడిగడ్డ బ్యారేజి పనులను ఎల్ అండ్ టీకి రూ. 2591కోట్లకు ఇచ్చారని, ఆ తర్వాత ప్రాజెక్టు అంచనాలను రూ. 4583 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ప్రతిమ కంపెనీకి రూ. 10 వేల కోట్ల పనులు ఇచ్చారని, 2014 వరకు ప్రతిమ కంపెనీ ఒక్క ప్రాజెక్టు పని కూడా చేయలేదన్నారు. మురళీధర్ రావు 7 ఏళ్లుగా పదవి ముగిసినా ఈఎన్సీగా కొనసాగుతున్నాడని, అతను కేసీఆర్ బంధువు అని, ప్రాజెక్టుల పేరిట దోచిపెడుతున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

Related Posts