YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘరామరాజు ఎన్నికతో రిఫరెండం...

రఘరామరాజు ఎన్నికతో రిఫరెండం...

ఏలూరు, జూలై 4, 
నిజానికి రిఫరెండం అనేది విపక్షాలు కోరుతాయి. అధికార పార్టీకి జనంలో బలం తగ్గిందని, వారి పట్ల పూర్తి వ్యతిరేకత ఉందని తాము నమ్ముతూ జనాలను నమ్మించాలని ఎపుడూ చూస్తాయి. ఏపీలో చూసుకుంటే జగన్ అధికారంలోకి వచ్చి ఒక్క ఏడాదే అయింది. అయితే చంద్రబాబు సహా విపక్షాలు మాత్రం జగన్ ఎపుడో ఫెయిల్ అయ్యాడని, ఆయన్ని జనం తెలియక నెత్తినెక్కించుకున్నారని ఫలితాలు వచ్చిన తొలి రోజునుంచి భ్రమల్లో ఉన్నారు. ఇక మొదట్లో కొన్నాళ్ళు అయితే జగన్ కి జనం ఓటే వేయలేదని, ఈవీఎంలను మ్యానేజ్ చేసి గెలిచాడు టీడీపీ వాళ్ళు అనేవారు. ఇపుడు మాత్రం జనం మోజుతో వేసారని, కానీ మోసపోయారని ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారికి నిజానికి ఎన్నికలు కావాలి. ఏదో రూపంలో జనం నాడి తెలియాలి. అపుడే జగన్ ని జనం మద్దతు లేదని స్పష్టంగా తేల్చేసి అధికార పార్టీ నావను నడి మధ్యలో ముంచేసేందుకు ఎత్తులు వేయగలరు.అయితే ఇక్కడ ఉన్నది జగన్, ఆయనకు జనం బలం ఏంటో తెలుసు. ఆయనది బాగా నమ్మకం. తనను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని బలమైన విశ్వాసం, పైగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా తనకే ఓటు చేస్తారని కూడా జగన్ ధీమా. అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో జగన్ దూసుకుపోవాలనుకున్నారు. నిజంగా మార్చిలో ఎన్నికలు జరిగితే ఫలితాలు నూటిని నూరు శాతం అలాగే వైసీపీకి ఫుల్ సపోర్టుగా వచ్చేవి. కానీ అప్పటికే అన్నం మెతుకు వాసన పట్టేసిన చంద్రబాబు తదితర విపక్షాలు ఇక ఎన్నికల వాయిదానే బెటర్ అనుకున్నారు. దానికి తోడు కరొనా కూడా దూసుకురావడంతో వారు అనుకున్నదే అయింది. అలా విపక్షం నోరు మూయించే తొలి చాన్స్ జగన్ కి తప్పిపోయింది.ఇక ఇపుడు జగన్ మరో ఎత్తు వేస్తున్నారు. పంటి కింద సలుపుగా మారినా నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు గారిని ఎన్నికల ముగ్గులోకి తానే స్వయంగా లాగుతున్నారు. ఆ విధంగా రాజా వారికి ఇంటి దారి చూపిస్తున్నాడు. ఆయన్ని అడ్డం పెట్టుకుని విపక్షాలు అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని చెడ్డ చేసి తన ఇమేజ్ పలుచల చేయడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు. పోతే పోయింది ఎన్నికలకు పోదాం, మన బలమేంటో పరుల బలమేంటో తేలిపోవాల్సిందేనని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకే మిగిలిన పార్టీలకు భిన్నంగా ఏకంగా రాజు గారి మీద అనర్హత‌ వేటు వేయించేందుకే జగన్ పట్టుపడుతున్నారు. ఇదే సీన్ బాబుకు ఎదురైనపుడు ఆయన వల్లభనేని వంశీని సస్పెండ్ చేసి ఊరుకున్నారు. అనర్హత పిటిషన్ స్పీకర్ కి ఇచ్చి పట్టుబట్టలేదు కూడా.ఇక సొంత పార్టీలో అక్కడక్కడ దీపావళి బాణాసంచా చిటపటలు వినిపిస్తున్నాయి. ఇలాగే ఊరుకుంటే అవి రాయలసీమ బాంబుల మాదిరిగా పెద్ద సౌండ్ చేస్తాయి. అందుకే జగన్ ఎవరూ తోక జాడించకుండా ఒక్క దెబ్బకు అన్ని పిట్టలూ బలి అన్నట్లుగా రాజు గారి ఎపిసోడ్ ని సీరియస్ గా తీసుకున్నారని అంటారు. రాజు గారిని మాజీని చేసి ఉప ఎన్నికలు పెట్టించి భారీ మెజారిటీతో ఆ సీటు గెలుచుకుని అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ, అటు విపక్షాల్లోనూ తనకు తిరుగులేదని గట్టిగా చెప్పాలని జగన్ ఆలోచన. ఇదే రకమైన ఆవేశాన్ని గతంలో ఎన్టీయార్ లో చూశారు తెలుగు జనం. ఆయన కూడా తన పార్టీ మనుషుల కంటే, కట్టబెట్టిన పదవుల కంటే జనాన్నే ఎక్కువగా నమ్ముకునేవారు. వారి మధ్యనే పంచాయతీ పెట్టి తీర్పు కోరేవారు. అలా చేయాలాంటే దమ్ము ఉండాలి. అపరిమితమైన ప్రజాదరణ ఉండాలి. ఈ రెండూ ఉండబట్టే జగన్ ఇపుడు ఎన్నికల యుధ్ధానికి ఎపుడైనా నేను రెడీ అనగలుస్తున్నారు. చాటు మాటు రాజకీయాలు చేసే టీడీపీ లాంటి పార్టీలకు జగన్ రణ నినాదం చెవి పోటుని తెచ్చేదే. పైగా అసలు ఏ మాత్రం మింగుడుపడనిదే.

Related Posts