YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఓం నమః శివాయ: *మనసు అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది?*

ఓం నమః శివాయ: *మనసు అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది?*

మనసు అనే పదం దాదాపు ప్రతి రోజు ఎదో ఒక విషయంలో మనం అందరం అనుకుంటూ ఉంటాము. మనిషి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదురా! వాని మనసు బాగుండాలి అని కూడ అంటూ ఉంటారు.  కాని ఈ మనసు ఎక్కడ వుంది అంటే మాత్రం ఎవరికీ తెలియదు. దీనినే చాల మంది అంతరం అని కూడ అంటారు. ఇది అన్నిటికంటే చాల వేగమైనది కూడ. అది ఎలా అంటే నీవు ఏదైనా అనుకుంటే నీ మనస్సు అక్కడికి వెళుతుంది అంటారు. దీనినే మనం మనిషివి ఇక్కడే వున్నావు, నీ మనస్సు ఎక్కడో వుంది అని అంటుంటారు.  ఈ మనసు చాల చాల సున్నితమైనది. అందుకే ఇది ప్రతి చిన్న విషయానికి react అవుతుంది. మనసుకు ఓపిక చాల తక్కువ మరియు సహనం కూడ తక్కువే. కాని ఇంతటి ఓపిక, సహనం లేని మనస్సుకు ఒకే ఒక దాని ద్వార ఓపిక, సహనం, అన్నిటికి మించి ప్రశాంతత మరియు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఇక్కడ ఆనందం అంటే చాల మంది అనుకోవచ్చు, ఇప్పుడు నాకేమి ఆనందంగానే వున్నాను కదా అని. కాని ఇప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా తాత్కాలిక ఆనందం.  ఎందుకంటే ఇప్పుడు నువ్వు పొందే ఆనందం వేరే ఏదైనా ఇంకొక విషయానికి మరల అది బాధపడుతుంది. ఈ ఆనందం చాలా రకాలుగా వుంది. ఈ ఆనందం ఎన్ని రకాలు అనేది బృహదారణ్యకోపనిషత్ లో చాల బాగా విశదీకరించి చెప్పారు, అది “మనుజులలో ఎవడు సకల భోగములు అనుభవించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది.  దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును ఆజానదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము.  దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము”. దీనిని బట్టి మనకు అర్ధమైనది ఏమిటంటే మనం ఇప్పుడు పొందే ఆనందం అసలు ఆనందమే కాదు. శాశ్వతమైన పరమానందమైన ఆనందాన్ని పొందినపుడు మాత్రమే మనం అసలు సిసలైన ఆనందాన్ని పొందిన వాళ్ళమవుతాము.  సరే కాని ఈ మనస్సు అంటే ఏమిటి, అది ఎలా వుంటుంది అంటే మాత్రం, ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరకదు కాని అది ఒకేఒక అధాత్మికలో మాత్రమె దొరుకుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే అసలు మనస్సే లేదు అని తెలుస్తుంది. ఎలా అంటే వున్నది ఒక ఈ శరీరం మరియు ఆత్మ. నిజానికి ఉండేవి ఈ రెండే, కాని ఏమైంది అంటే మనం కలిగిన భావనలను ఆ ఆత్మ (శక్తికి) కు ఒక తెరగా ఏర్పరచాము అదేలాగు అంటే మనం గుడికి వెళితే హారతికి ముందు దేవుని ప్రతిమ కనబడకుండా ముందర ఒక తెల్లటి వస్త్రాన్ని అడ్డంగా వేస్తారు.  ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ప్రక్కకు తీస్తారో అప్పుడు దేవుని ప్రతిమ మనకు కనిపిస్తుంది అదేలాగు మనం కూడ ఇక్కడ ఒక తెరను ఏర్పరచాము, అదియే మనస్సు. ఈ మనసు ఎలా ఏర్పడింది అంటే ప్రతి రోజు ఈ శరీరం చేసే ప్రతి పనిని మరియు క్రియను మనం, నేను అనే అహంకార భావనతో చేయడం వలన ఇది ఏర్పడింది.  ఈ విధంగా మనకై మనం అజ్ఞానంలో అశాశ్వతమైన మరియు నశ్వరమైన ఈ ప్రపంచంలో నావి అనే ఒకే ఒక భావనతో ఏర్పడిన తెరయే ఈ మనస్సు. ఈ విధంగా మనకై మనం ఏర్పరచిన ఈ మనస్సే ఇప్పుడు మనలను శాశించే స్థాయిలో వుంది.దీనిని మనం ఏ విధంగా అజ్ఞానంతో ఏర్పరచామో, అదే విధంగా జ్ఞానంతో నియంత్రించి మన నిర్దిష్టమైన, లక్ష్యమైన మరియు మన ధ్యేయమైన ఆ పరమాత్మునిని హృదయంలో దర్శించుకోవచ్చు.  ఈ మనస్సును మనం నియంత్రించగలిగితే అదియే మనకు అసలు సిసలైన మిత్రువు లేకపోతే నీ పతనానికి అదియే మొదటి శత్రువు. చాల మంది అనుకుంటారు శత్రువులు బయట వుండారు అని, కాని అసలు శత్రువు నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న తెరయైన నీ మనస్సే నీ శత్రువు. ఇది అందరు గుర్తుంచుకోవలసిన విషయం.  ఎప్పుడైతే మనం మనలో సాత్విక గుణాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మన మనసు అంతఃకరణ శుద్ది అయి ఆ పరంధాముని జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము.  ఎప్పుడైతే ఆ పరమాత్ముని జ్ఞానం మరియు తత్వం అర్థమవుతుందో అప్పుడు మన మనసుకు automatic గా నిదానత్వం, సరళత, ఓపిక, సహనం, నిర్మలత్వం మరియు ప్రశాంతత చేకురుతాయి. వీటి అన్నిటికి మించి పరమానందం పొందాలంటే మాత్రం జ్ఞానం ఒకటి సరిపోదు. మనం తెలుసుకున్న జ్ఞానంతో ఆ దేవదేవుడైన పరమాత్మ స్వరూపుణ్ణి నీ హృదయంలో దర్శించడం వలన మాత్రమె సాధ్యం.  నీ మనసును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు.  అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని (నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని) దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు  అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది. దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.
*ఈ మనస్సు గురించి రమణ మహర్షి తెలిపిన ముఖ్యమైన విషయాలు :-*
- వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.
- మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.
- ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.
- మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.
- వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.
- లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.
- ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.

Related Posts