YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్డీ, సిద్ధప్పకు చివరి ఎన్నికలేనా

 యడ్డీ, సిద్ధప్పకు చివరి ఎన్నికలేనా

బెంగళూర్, జూలై 6, 
వచ్చే ఎన్నికల నాటికి కర్ణాటక రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. ప్రధనంగా ముఖ్యమైన పార్టీల్లో భారీ మార్పులు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాయకత్వం నుంచి కీలక నేతలు తప్పుకుంటారని, అధిష్టానాలే తప్పిస్తాయన్న ప్రచారం కూడా జోరుగా ఉంది. కర్ణాటకలో ఎన్నికలు జరగడానికి ఇంకా మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే ప్రస్తుతం ప్రధాన పార్టీలను లీడ్ చేస్తున్న నేతలు వయసు మీరిపోవడం, అధిష్టానం అసంతృప్తి వెరసి వారు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం వచ్చిందని చెబుతున్నారు.ముఖ్యమంత్రి యడ్యూరప్ప 70 ఏళ్ల వయసు దాటింది. బీజేపీ నిబంధనల ప్రకారం ఆయన స్వచ్ఛందంగా రాజీకీయాల నుంచి తప్పుకోవాలి. అయితే కర్ణాటకలో ఆయన వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఏకైక కారణంతో యడ్యూరప్పను కంటిన్యూ చేస్తున్నారన్న టాక్ ఉంది. యడ్యూరప్పకు ఇదే చివరి అవకాశమన్న చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతుంది. గత కొన్నాళ్లుగా అధిష్టానం సయితం ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు.యడ్యూరప్పను వచ్చే ఎన్నికల నాటికి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలన్నది అధిష్టానం యోచనగా ఉంది. యడ్యూరప్ప కూడా స్వచ్ఛందంగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు. తన కుమారుడు రాఘవేంద్రకు రాజకీయంగా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే యడ్యూరప్ప హైకమాండ్ ను కోరారని చెబుతున్నారు. యడ్యూరప్ప పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది.సిద్ధరామయ్య గత ఎన్నికల సమయంలోనూ తనక ఇవే చివరి ఎన్నికలు అని ప్రచారంలో ఆయనే స్వయంగా చెప్పారు. పార్టీ అధికారంలోకి రాలేక పోవడంతో ఆయన ప్రస్తుతం శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను పార్టీ హైకమాండ్ నియమించింది. వచ్చే ఎన్నికల నాటికి కర్ణాటక కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య హవా పూర్తిగా తొలగిపోతుందన్న ప్రచారం అయితే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరు ముఖ్యమైన నేతలు యడ్యూరప్ప, సిద్ధరామయ్యలు రాజకీయంగా తప్పుకుంటున్నట్లే చెప్పాలి.

Related Posts