YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెండింగ్ వేతనాలు చెల్లిoచాలి

పెండింగ్ వేతనాలు చెల్లిoచాలి

ఆదిలాబాద్  జూలై 7          
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఏఐటియుసి కార్యాలయంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కన్నాల లక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్  పాల్గొని  మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కొవిడ్ 19 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోన మహమ్మారిని పారద్రోలడం కోసం ఎంతో కష్టపడుతున్న కార్మికులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ గత రెండు నెలలుగా వేతనాలు రాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కార్మికుల సేవలు మరువలేనివని చేతులెత్తి దండం పెడుతుoటే, రిమ్స్ స్పార్క్  కాంట్రాక్టర్ మాత్రం ప్రతి నెల ఐదో తేది లోపు వేతనాలు వేస్తానని అగ్రిమెంట్ రాసుకుని ఇప్పుడు మాత్రం నా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తున్నారన్నారు ఇచ్చే కొద్ది జీవితంలో నుంచి కూడా పిఎఫ్ పేరుతో ఈఎస్ఐ పేరుతో దోచుకుంటున్నాడన్నారు. ఎందుకు సార్ అని అడుగుతే అంతే ఉంటది ఎక్కువ మాట్లాడొద్దు నిన్ను ఉద్యోగం నుండి తొలిగిస్తామంటూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్నారు, ఈ విషయమై మై రిమ్స్ డైరెక్టర్ ని అడిగితే మేము బిల్ చేసేశాము మా దగ్గర ఏమీ లేదు అని అంటున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టువంటి 10 శాతం ఇన్సెంటివ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కార్మికులకు రాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి  కార్మికుల పైన సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారన్నారు, కార్మికులను ఆదుకోవడంలో విఫలం చెందారన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి  కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇప్పించాలని పిఎఫ్, ఈఎస్ఐ కార్డులను వెంటనే ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అటువంటి ఇన్సెంటివ్ కూడా వెంటనే రెండు రోజులలో ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో  రిమ్స్ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి కాసీం, పి పద్మ, డేవిడ్,  శ్రీనివాస్, వామన్,   ఏక్ బాల్, చందు,  తదితరులు పాల్గొన్నారు

Related Posts