YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముహుర్తం కుదిరినట్టేనా

ముహుర్తం కుదిరినట్టేనా

కడప, జూలై 8,
మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమయిందంటున్నారు. కొద్దిరోజుల్లోనే పెద్దయెత్తున టీడీపీ నేతలు పార్టీలో చేరతారంటున్నారు. ఇందుకు జులై 10వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీలో చేరడం, ఇటీవల చేరికలు ఆగిపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా ముహూర్తం ఖరారు అయిందన్న వార్తలు రావడంతో ఆయన అప్రమత్తమయినట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎ‌మ్మెల్యేలు పార్టీని వీడారు. మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాంలు వైసీపీకి మద్దతు పలికారు. అధికారికంగా వీరు టీడీపీ సభ్యులైనప్పటికీ పార్టీలో లేనట్లే పరిగణనలోకి తీసుకోవాలి. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతుంది. ముఖ్యంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు పార్టీని వీడతారని పెద్దయెత్తున రూమర్స్ వచ్చాయి. అయితే వీటిని ఇద్దరూ కొట్టి పారేశారు.శాసనమండలిలో ఎమ్మెల్సీలపై వైసీపీ కన్ను పడిందంటున్నారు. ఎమ్మెల్సీలను త్వరగా పార్టీలో చేర్చుకోవాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. ఇప్పటికే పోతుల సునీత, శమంతకమణి, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు టీడీపీ ని వీడి వైసీపీలో చేరారు. అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడంతో తిరిగి ఎన్నిక జరిగింది. జగన్ మళ్లీ ఆయననే అభ్యర్థిగా ఎంపిక చేసి ఎమ్మెల్సీని చేశారు. ఈ విధమైన సంకేతాలను వైసీపీ అధినాయకత్వం టీడీపీ ఎమ్మెల్సీలకు బలంగా పంపింది. మరో ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీలో చేరతారన్న ప్రచారం అయితే అమరావతిలో జోరుగా సాగుతోంది. వీరితో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా రెడీ చేశారట. ఇదే పనిలో కొందరు మంత్రులు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి నేతలు పార్టీ మారతారని సమాచారం. మొత్తం మీద జులై 10వ తేదీన ఎవరెవరు పార్టీ వీడతారన్న టెన్షన్ అధినేతను పట్టుకుంది.

Related Posts