YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కష్టాలు పడుతున్న ప్రియాంక

కష్టాలు పడుతున్న ప్రియాంక

లక్నో, జూలై 8,
ప్రియాంక గాంధీ ఇక పూర్తి స్థాయిలో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. మిషన్ ఉత్తర్ ప్రదేశ్ ను ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో పూర్తి స్థాయి రాజకీయాలు ప్రియాంక గాంధీ చేయనున్నారు. త్వరలోనే ప్రియాంక గాంధీ తన నివాసాన్ని లక్నోకు మార్చనున్నారు. ఇదిచాలా కాలం నుంచి అనుకున్న విషయమే అయినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్ ను ఓన్ చేసుకునే దిశగా ప్రియాంక గాంధీ ప్రయత్నిస్తున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని లోథి రోడ్ లో ఉన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాల్సిందిగా ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే ఆమె అంతకు ముందే లక్నోకు మకాం మార్చాలని సిద్ధమయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లక్నోలోని మాజీ మంత్రి షీలా కౌల్ నివాసాన్ని ప్రియాంక గాంధీ ఉపయోగించుకోబోతున్నారు. షీలా కౌల్ మరణం తర్వాత ఆ బంగళా లక్నోలో ఖాళీగా ఉంది. మాజీ ప్రధాని నెహ్రూకు దగ్గర బంధువైన షీలా కౌల్ ఇంట్లోనే ప్రియాంక గాంధీ ఉండబోతున్నారు. ఇప్పటికే ఆ బంగళాకు పూర్తి స్థాయి మరమ్మతులు చేశారు.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. 2022 లో జరిగే ఈ ఎన్నికలకు ప్రియాంక గాంధీ ఇప్పటి నుంచే సమాయత్త మవుతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రియాంక గాంధీతో పాటు పార్టీని కూడా నైరాశ్యంలో ముంచాయి. అమేధీలో రాహుల్ ఓటమిని ప్రియాంక గాంధీ జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీని గాడిన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు షిఫ్ట్ అవుతున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చెబుతున్నాయి.2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు సీట్లను మాత్రమే సాధించింది. అప్పట్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్దమయింది. ఉత్తర్ ప్రదేశ్ ను దక్కించుకుంటే తప్ప ఢిల్లీ పీఠం గెలవడం సాధ్యం కాదు. అందుకే ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసేందుకు ప్రియాంక గాంధీ సిద్ధమయ్యారు. అందుకోసమే ఆమె లక్నోలో నివాసం ఏర్పరచుకున్నారు. మొత్తానికి ఉత్తర్ ప్రదేశ్ ను గాంధీ కుటుంబం నిర్లక్ష్యం చేసిందన్న అపవాదు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts