YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పాట పాడుతున్న కాంగ్రెస్ సీనియర్లు...

జగన్ పాట పాడుతున్న కాంగ్రెస్ సీనియర్లు...

బెంగళూర్ , జూన్ 8, 
జగన్. ఏం అనుభవం లేని కుర్రాడు, పైగా నన్ను కాదని ఇంతటి జనాదరణ సంపాదిస్తాడా. తండ్రి వైఎస్సారే నా ముందు ఒద్దికగా ఉండేవారు. ఈ జగన్ మూడు నెలల ఎంపీ మాత్రమే. పైగా వైఎస్ కోరి కోరి అడిగితే ఇచ్చిన సీటు. అలా నా దయతో గెలిచిన జగన్ కి ఈ పట్టుదల ఏంటి, ఏం చూసుకుని. అసలు కాంగ్రే లేకపోతే వైఎస్ కుటుంబం ఉంటుందా. ఇవి కదా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆలోచనలు. పదేళ్ళ క్రితం ఆమె అంచనా జగన్ మీద అంతే. అలా ఆమె ట్యూన్ చేయబడ్డారు. జగన్ పొడగిట్టని వారు ఆమెకు అలా చెడు చెప్పి ఉంచారు. కానీ అంతకంతకు ఎదిగిన జగన్ తరువాత ఏ మాత్రం ఖాతరు లేకుండా కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి అయిదున్నర లక్షల మెజారిటీతో కడప ఉప ఎన్నికల్లో గెలిచాడు. ఆ తరువాత నుంచి జగన్ రాజకీయ ఎదుగుదల ఒక ఊపు మీద సాగింది. జగన్ ఈనాటికి ఏపీకి బంపర్ మెజారిటీతో సీఎం. ఇవన్నీ సోనియాకు తెలియకుండా ఉంటాయా. అయినా జగన్ గురించి ఆమె ఇపుడు ఆలోచించి ఏం లాభం. కాంగ్రెస్ లో లో జగన్ ఉండకూడదు అనుకుంటే జగన్ ఉన్న ఏపీలో కాంగ్రెస్ ఊపిరి కూడా పోయి ఉనికి పోయిందిగా.ఏ జగన్ గురించి సోనియా వినకూడదనుకుందో అదే జగన్ మీద కీర్తలను, పొగడ్తలు, అందునా తానంటే ఎంతో విధేయత చూపించే కన్నడ కాంగ్రెస్ నేత. సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా మారి ముఖ్యమంత్రిత్వం నెరపిన నాయకుడు సిధ్ధరామయ్య ఇపుడు జగన్ సంకీర్తనలు అందుకున్నారు. జగన్ గ్రేట్ అంటున్నారు. జగన్ లాంటి నాయకుడు లేడు అంటున్నారు. జగన్ చూసి దేశమంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని కూడా అంటున్నారు. జగన్ కరోనా వేళ పేదలకు చేస్తున్న సాయం అపూర్వమని కూడా సిధ్ధరామయ్య కితాబు ఇచ్చారు. అంతేనా కరోనా కట్టడికో జగన్ సక్సెస్ ఫుల్ సీఎం గా ఉన్నారని అంటున్నారు. జగన్ ని చూసి కాస్తా అయినా నేర్చుకోవయ్యా అంటూ కన్నడ సీఎం యడ్యూరప్పను దెప్పిపొడుస్తున్నాడు. స్కాములు మాత్రమే కాదు, జగన్ ఏపీలో అంబులెన్సులను వేలాదిగా ఒకేసారి రోడ్డెక్కించాడు, కరోనా వేళ రోగులను కాపాడే మొబైల్ ఆసుపత్రులను తీసుకువచ్చారంటూ చెప్పుకొచ్చారు.సరే తన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న యడ్యూరప్పను విమర్శించడానికి ఒకటి రెండు మాటలు జగన్ గురించి సిధ్ధరామయ్య ఎక్కువ చెప్పిఉంటారు. ముఖ్యమంత్రిని నిందించాలన్న వైఖరితో అదే ఫ్లోలో జగన్ ని ఆకాశానికి ఎత్తేసి ఉంటారు. అయితే అయింది కానీ రెండో వైపు చూసుకోద్దా. తన పార్టీ అధినేత్రి సోనియాగాంధి చెవులకు ఈ కీర్తనలు పెద్ద పోటుగా ఉంటాయని కనీసంగా కూడా ఆలోచించనక్కరలేదా. ఎంత సీనియర్ నేత సిధ్ధరామయ్య ఇలా పప్పులో కాలేయడమేంటి. నాడు సోనియమ్మ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు అంతా కాస్తున్న వేళ ధిక్కారములు చేసి మరీ సోనియా గాలి తీసేసి బయటకు వచ్చిన జగన్ ని పొగడడమేంటి. అది కూడా ఇపుడు కాంగ్రెస్ అధినేత్రి చిక్కుల్లో ఉన్న వేళ, అధికారం అంతా చీకటి అయిన వేళ, రేపటి ఆశ కనుమరుగు అయిన వేళ, మరో వైపు జగన్ వెలిగిపోతున్న వైభవాన్ని విడమరచి వివరించి చెబితే అమ్మలకు అమ్మ ఆ సోనియమ్మ తట్టుకోగలదా.ఇది కదా కావాల్సింది. శత్రువు ముందు తన గొప్పతనం తాను కాక అదే శిబిరానికి చెందిన మరొకరి వివరించిన వేళ కదా అసలైన గెలుపు. గత ఏడాది జనాల తీర్పుని అందుకుని ముఖ్యమంత్రి గద్దెనెక్కిన జగన్ కి అంతకంటే ఇది అద్భుత విజయం కదా. తనను పూచిక పుల్లలా చూసి ఏ మాత్రం ఖాతరు చేయకుండా బయటకు నెట్టిన సోనియా గాంధీకి ఇపుడు ఆమె వందిమాగధులే తన గురించి వేయింతలు గొప్పగా చెబుతున్న వేళ నిజంగా జగన్ తాను ఎంత సాధించారో తెలుసుకుని మురిసిపోతారు కదా. మొత్తం మీద జగన్ని ఓ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేత మెచ్చుకోవడం ఒక గొప్ప అయితే అది సోనియమ్మ చెవిన పడడం మరింత గొప్ప. ఏమైనా జగన్ ఈనాటికి అసలైన విజేత అనిపించుకున్నారని అంటున్నారంతా.

Related Posts