YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్‌కు చేరుకున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్..!

భారత్‌కు చేరుకున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్..!

హైద‌రాబాద్‌ ఆగష్టు 4
ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌కు వచ్చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్2, ఫేజ్3 ఔషధ ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఈ వాక్సీన్‌ యూకేలో ఇప్పటికే విజయవంతంగా హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేసింది.
తమ పరిశోధనల్లో అద్భుత ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్ రిజల్ట్స్‌ను ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్‌'లో ప్రచురించారు.

Related Posts